ముద్రగడ సంచలన నిర్ణయం.. కాపు సామాజిక వర్గానికి బహిరంగ లేఖ

కాపు రిజర్వేషన్ల ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు కాపు సామాజిక వర్గానికి..

ముద్రగడ సంచలన నిర్ణయం.. కాపు సామాజిక వర్గానికి బహిరంగ లేఖ

Edited By:

Updated on: Jul 13, 2020 | 12:29 PM

Kapu Leader Mudragada Takes Sensational Decision : కాపు రిజర్వేషన్ల ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు కాపు సామాజిక వర్గానికి ఆయన బహిరంగ లేక రాశారు. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారింది.

మానసికంగా కృంగిపోయేలా సోషల్ మీడియాలో తనపై కొందరు దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవకాశవాది, గజదొంగ, కులద్రోహి, అంటూ నానా రకాలుగా కొందరు తిట్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఒంటికాలిపై లేచిన ముద్రగడకు ఇప్పుడు కాళ్ళు పడిపోయాయా అని పోస్టింగులు పెడుతున్నారని.. ఇవన్నీ చూసి కలత చెంది ఉద్యమం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంటున్నట్లు ప్రకటించారు ఉద్యమనేత ముద్రగడ.