వేరే పార్టీలో చేరండి, లేదా సొంతంగా పార్టీ పెట్టుకోండి, కపిల్‌ సిబల్‌కు సీనియర్ల సూచన

కాంగ్రెస్‌పార్టీని ప్రజలు ప్రత్యామ్నాయంగా భావించడం లేదంటూ ఆ పార్టీ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాకరేపుతున్నాయి.. సొంత పార్టీపైనే విమర్శలు గుప్పించడాన్ని..

వేరే పార్టీలో చేరండి, లేదా సొంతంగా పార్టీ పెట్టుకోండి, కపిల్‌ సిబల్‌కు సీనియర్ల సూచన
Follow us
Balu

|

Updated on: Nov 18, 2020 | 4:46 PM

కాంగ్రెస్‌పార్టీని ప్రజలు ప్రత్యామ్నాయంగా భావించడం లేదంటూ ఆ పార్టీ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాకరేపుతున్నాయి.. సొంత పార్టీపైనే విమర్శలు గుప్పించడాన్ని తోటి నేతలే తప్పుపడుతున్నారు. కాంగ్రెస్‌లో ఉంటూ కాంగ్రెస్‌ను విమర్శించే బదులు వేరే పార్టీని చూసుకుంటే ఉత్తమం కదా అని సలహా ఇస్తున్నారు.. అది కుదరకపోతే కొత్త పార్టీ పెట్టుకోవాలని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్‌పార్టీ తమకు సరైంది కాదని భావిస్తే వేరే పార్టీలోకి వెళ్లిపోవచ్చని అన్నారు. పార్టీ విశ్వసనీయతను దెబ్బతీసే పనులు చేయకూడదని కపిల్‌ సిబల్‌కు హితవు చెబుతున్నారు. కపిల్‌సిబల్‌కు గాంధీ ఫ్యామిలీతో సాన్నిహిత్యం ఉందని, పార్టీ నాయకత్వం ముందు కానీ, పార్టీ సమావేశంలో కానీ సమస్యలను చెప్పుకోవచ్చని అన్నారు సీనియర్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌధరి. కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయాలనే పట్టుదల ఉంటే తన సామర్థ్యాన్ని రుజువు చేసుకోవాలని అన్నారు.. బీహార్‌ ఎన్నికలప్పుడు పార్టీ కోసం ఏం చేశారని కపిల్‌ను ప్రశ్నించారు అధిర్‌ రంజన్‌. బీహార్‌ ఎన్నికల ఫలితాల తర్వాత కపిల్‌సిబల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌పార్టీలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఎవరూ ముందుకు రావడం లేదని, ఇలాగే కొనసాగితే పార్టీ గ్రాఫ్‌ పడిపోతుందని కపిల్‌ సిబల్‌ అన్నారు.