ఒకే ఒక్క డోసుతో కరోనాకు విముక్తి.. !

|

Sep 24, 2020 | 3:28 PM

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుంచి విముక్తి కలిగించేందుకు విశ్వ వ్యాప్తంగా డ్రగ్స్ కంపెనీ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.

ఒకే ఒక్క డోసుతో కరోనాకు విముక్తి.. !
Follow us on

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుంచి విముక్తి కలిగించేందుకు విశ్వ వ్యాప్తంగా డ్రగ్స్ కంపెనీ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుని తుది దశ ప్రయోగాల్లో నిమగ్నమయ్యారు. వ్యాక్సిన్ ను మార్కెట్ లో తీసుకువచ్చేందుకు ప్రపంచవ్యాప్త కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇందులో భాగంగా జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ మరో ముందుకేసింది. ఒకే ఒక్క డోసుతో కొవిడ్‌-19 నుంచి రక్షణ కల్పించగల సామర్థ్యమున్న టీకాను అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థ కృషి చేస్తోంది. మానవులపై ఆ టీకా తుది దశ ప్రయోగ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా అమెరికా, దక్షిణాఫ్రికా, అర్జెంటీనా, బ్రెజిల్‌, చిలీ, కొలంబియా, మెక్సికో, పెరూ దేశాలల్లో మొత్తం 60 వేల మంది వలంటీర్లకు టీకాను అందించేందుకు ఏర్పాట్లు చేశారు. సాధారణంగా ఏదైనా టీకా మంచి ఫలితాలనివ్వాలంటే కనీసం రెండు డోసులను తీసుకోవాల్సి ఉంటుందని.. అందుకు భిన్నంగా ఒకే ఒక్క డోసుతో కరోనా నుంచి రక్షణ కల్పించేలా తమ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశామని జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ప్రధాన శాస్త్రీయ అధికారి డాక్టర్‌ పాల్‌ స్టోఫెల్స్‌ తెలిపారు.