నేనే అధ్యక్షుడినైతే, జో బిడెన్ సంచలన హామీలు, వరాలు

| Edited By: Pardhasaradhi Peri

Aug 16, 2020 | 10:19 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిచి అధ్యక్షుడినైతే హెచ్-1బీ వీసా సిస్టం ను సంస్కరిస్తానని, గ్రీన్ కార్డు వ్యవస్థను తొలగిస్తానని డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్ ప్రకటించారు. ఇండియన్ అమెరికన్లను..

నేనే అధ్యక్షుడినైతే, జో బిడెన్ సంచలన హామీలు, వరాలు
Follow us on

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిచి అధ్యక్షుడినైతే హెచ్-1బీ వీసా సిస్టం ను సంస్కరిస్తానని, గ్రీన్ కార్డు వ్యవస్థను తొలగిస్తానని డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్ ప్రకటించారు. ఇండియన్ అమెరికన్లను ఆకట్టుకునేందుకు ఆయన తన ప్రచారంలో ఈ విస్పష్టమైన హామీ ఇచ్చారు. భారత 74 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఈ మేరకు అత్యంత ప్రధానమైన పాలసీ డాక్యుమెంట్ ని విడుదల చేశారు. కుటుంబ ఆధారిత ఇమ్మిగ్రేషన్ సిస్టం ని సపోర్ట్ చేస్తానని, మత పరమైన వర్క్ వీసాల ప్రాసెసింగ్ ని ప్రక్షాళన చేస్తానని అన్నారు. భాషా సంబంధ ఆంక్షలను తొలగిస్తానని, భారతీయ అమెరికన్లకు వారు కోరిన విధంగా సేవలందిస్తానని ఆయన పేర్కొన్నారు. జో బిడెన్ ఈ విధమైన హామీలు ఇవ్వడం ఇదే మొదటిసారి.

అమెరికాలో 1.3 మిలియన్ల ప్రవాస భారతీయులున్నారు. ఎనిమిది రాష్ట్రాల్లో బిడెన్ పట్ల ప్రజలకు మంచి ఆదరణ ఉంది. జాత్యహంకార ధోరణులను అణచివేస్తానని, దేశంలో ప్రతి పౌరుడూ స్వేఛ్చగా, నిర్భయంగా తిరిగేలా చట్టాలు తెస్తానని బిడెన్ వాగ్దానం చేశారు.