AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యార్థులకు బిగ్ అలెర్ట్.. పరీక్షలు వాయిదా! కారణం ఏంటంటే?

జులై 24న జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా పడ్డాయి. ఉదయం, మధ్యాహ్నం సెషన్ల ఎగ్జామ్స్ రద్దయ్యాయి. విద్యార్థుల భద్రత, ప్రయాణ సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. వాయిదాపడిన పరీక్షల కొత్త తేదీలను యూనివర్సిటీ త్వరలో ప్రకటిస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

విద్యార్థులకు బిగ్ అలెర్ట్.. పరీక్షలు వాయిదా! కారణం ఏంటంటే?
Jntuh
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Jul 23, 2026 | 9:00 PM

Share

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వివిధ విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపునివ్వడంతో జవాహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) కీలక నిర్ణయం తీసుకుంది. జులై 24 శుక్రవారం నాడు జరగాల్సిన అన్ని రకాల పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎ. జయ లక్ష్మి ఒక ప్రకటనలో అధికారికంగా వెల్లడించారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించాల్సిన పరీక్షలన్నీ వాయిదా పడ్డాయని, వాయిదా వేసిన పరీక్షల కొత్త తేదీలు, రీవైజ్డ్ టైమ్‌టేబుల్‌ను త్వరలోనే వెల్లడిస్తామని యూనివర్సిటీ యాజమాన్యం స్పష్టం చేసింది. కాన్సిట్యూయంట్, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

రాష్ట్రంలో వివిధ వర్గాలు, సంఘాలు చేపట్టిన ఆందోళనలు, బంద్ పిలుపుల నేపథ్యంలో విద్యార్థుల ప్రయాణ సౌకర్యాలు, భద్రతను దృష్టిలో ఉంచుకుని జేఎన్‌టీయూహెచ్ ఈ ముందస్తు చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుకోకుండా పరీక్షలు వాయిదా పడటంతో లక్షలాది మంది ఇంజనీరింగ్, ఫార్మసీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదుపరి సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు.

దేశ రాజధాని న్యూఢిల్లీలో కాక్రొచ్ జనతా పార్టీ చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నీట్ పరీక్ష లీకేజీ నిరసిస్తూ విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. జాతీయ స్థాయిలో ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కూడా పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోంది. ఒకవైపు తెలంగాణలో పరీక్షల వాయిదా, విద్యా సంస్థల బంద్ వాతావరణం, మరోవైపు ఢిల్లీలో సీజేపీ భారీ ఆందోళనతో దేశవ్యాప్తంగా ప్రస్తుత పరిణామాలు తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us