Jhye Richardson: చెన్నై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ వేలం జరుగుతుంది. ఈ వేలంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా బౌలర్ జే రిచర్డ్సన్ రూ.14 కోట్లకు అమ్ముడుపోయాడు. కోటిన్నర రూపాయల బేస్ ప్రైస్‌తో ఉన్న ఈ ఆసీస్ బౌలర్‌ను పంజాబ్ జట్టు దక్కించుకుంది. న్యూజిలాండ్ పేసర్ ఆడమ్ మిల్నేను ముంబై జట్టు కొనుగోలు చేసింది. రూ.50 లక్షల కనీస బేస్ ప్రైస్‌తో ఉన్న మిల్నేను రూ.3.20 కోట్లకు ముంబై దక్కించుకుంది. మరో ఆసీస్ బౌలర్ కౌల్టర్‌నైల్‌ను ముంబై సొంతం చేసుకుంది. రూ.5 కోట్లకు అతన్ని కొనుగోలు చేసింది. భారత బౌలర్ ఉమేష్ యాదవ్ బేస్ ప్రైస్‌కు అమ్ముడయ్యాడు. ఢిల్లీ ఫ్రాంచైజీ అతన్ని కోటి రూపాయలకు కొనుగోలు చేసింది.
ఇంగ్లాండ్ స్పిన్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.7 కోట్లకు కొనుగోలు చేసింది. గతంలో బెంగళూరుకు ఆడిన అలీని తాజాగా సీఎస్కే దక్కించుకుంది. బంగ్లాదేశ్ స్టార్ ప్లేయర్ షకిబుల్ హసన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు రూ.3.20 కోట్లకు దక్కించుకుంది. ఇప్పటివరకు ఏడు సీజన్లలో షకిబ్ ఇదే జట్టుకు ఆడాడు. చివరగా సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్, టీ20 నెంబర్ వన్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలన్‌ను కనీస ధర 1.5 కోట్లకు పంజాబ్ కొనుగోలు చేసింది.
Also Read: