ప్రముఖ జెట్ ఎయిర్‌వేస్ మూసివేత తప్పదా..!

| Edited By:

Apr 17, 2019 | 2:51 PM

ప్రముఖ జెట్ ఎయిర్‌వేస్ ఇప్పట్లో ఆర్థిక నష్టాల నుంచి కోలుకోలేదా..? మూసివేతకు జెట్ ఎయిర్‌వేస్ సిద్ధంగా ఉందా..? అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. సంస్థ మూతపడకుండా ఉండేందుకు తక్షణ సాయంగా రూ.400కోట్లు అందించాలని సంస్థ రుణదాతలను కోరుతోంది. దీనిపై ఇప్పటివరకు బ్యాంకర్లు ఎలాంటి నిర్ణయాన్ని తెలపలేదు. ముంబయిలో జెట్ ఎయిర్‌వేస్ సంస్థ బోర్డు సమావేశం మూడు గంటలపాటు జరిగినప్పటికీ.. సంస్థ భవితవ్యంపై ఎలాంటి నిర్ణయానికి రాలేదు. దీంతో జెట్ ఎయిర్‌వేస్ భవితవ్యంపై అనుమానాలు కొనసాగుతున్నాయి. అయితే జెట్ […]

ప్రముఖ జెట్ ఎయిర్‌వేస్ మూసివేత తప్పదా..!
Follow us on

ప్రముఖ జెట్ ఎయిర్‌వేస్ ఇప్పట్లో ఆర్థిక నష్టాల నుంచి కోలుకోలేదా..? మూసివేతకు జెట్ ఎయిర్‌వేస్ సిద్ధంగా ఉందా..? అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. సంస్థ మూతపడకుండా ఉండేందుకు తక్షణ సాయంగా రూ.400కోట్లు అందించాలని సంస్థ రుణదాతలను కోరుతోంది. దీనిపై ఇప్పటివరకు బ్యాంకర్లు ఎలాంటి నిర్ణయాన్ని తెలపలేదు. ముంబయిలో జెట్ ఎయిర్‌వేస్ సంస్థ బోర్డు సమావేశం మూడు గంటలపాటు జరిగినప్పటికీ.. సంస్థ భవితవ్యంపై ఎలాంటి నిర్ణయానికి రాలేదు. దీంతో జెట్ ఎయిర్‌వేస్ భవితవ్యంపై అనుమానాలు కొనసాగుతున్నాయి.

అయితే జెట్ ఎయిర్‌వేస్‌కు రూ.8వేల కోట్ల రుణాలున్నాయి. ఇప్పుడు సంస్థ నష్టాల్లో నడుస్తోంది. సంస్థను మూసివేయకుండా ఉండేందుకు తక్షణంగా రూ.400కోట్లు కావాలి. మరోవైపు జీతాలు చెల్లించని కారణంగా దివాలా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరతామని పైలట్ల సంఘం హెచ్చరిస్తోంది. ఉద్యోగులపై నిర్ణయం తీసుకోనట్లయితే జాతీయ కంపెనీ ట్రైబ్యునల్‌ను ఆశ్రయిస్తామని సంఘం ఉపాధ్యక్షుడు అసీమ్ తెలిపారు.