
కరోనా చికిత్సలో సమర్థంగా పనిచేస్తున్నమెడిసిన్ ల్లో ఒకటైన ‘ఫావిపిరవిర్’ ట్యాబ్లెట్ల ధరలు వరుసగా దిగివస్తున్నాయి. దేశీయ జెనెరిక్ మందు తయారీతో ఈ ట్యాబ్లెట్ల ధరలు సామాన్యులకు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా, రూ.39కే కరోనా ట్యాబ్లెట్ అందజేస్తామని జెన్‌బర్క్ ఫార్మాసూటికల్స్ కంపెనీ తెలిపింది.
ఫావివెంట్ పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేసినట్టు తెలిపింది. కంపెనీ చైర్మన్ ఆశిశ్ యూ భూటా ఈ విషయాన్ని ప్రకటించారు. ఒక్కో ట్యాబ్లెట్ 200 మిల్లీగ్రాముల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, ఒక్కో స్ట్రిప్‌లో 10 ట్యాబ్లెట్లు వస్తాయని తెలిపారు. అటు.. ఫావిపిరవిర్ మందుల తయారీకి సిప్లా ఫార్మాకు భారత ఔషధ నియంత్రణ మండలి (DCGI)అనుమతి ఇచ్చిందన్నారు. దీంతో సిప్లెంజా పేరుతో ట్యాబ్లెట్‌ను విడుదల చేయనున్నట్టు ఆ కంపెనీ పేర్కొన్నది.