ఇకనుంచి జపాన్‌ ఎయిర్‌లైన్స్‌లో ఆ పదం వినిపించదు…!

|

Sep 30, 2020 | 1:32 PM

జపాన్‌ ప్రభుత్వం ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది.. సాధారణంగా విమానప్రయాణికులకు స్వాగతం పలుకుతూ ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది లేడీస్‌ అండ్‌ జంటిల్‌మెన్‌ అనడం చూస్తుంటాం..! జపాన్‌లో ఇకనుంచి అలా కుదరదు..

ఇకనుంచి జపాన్‌ ఎయిర్‌లైన్స్‌లో ఆ పదం వినిపించదు...!
Follow us on

జపాన్‌ ప్రభుత్వం ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది.. సాధారణంగా విమానప్రయాణికులకు స్వాగతం పలుకుతూ ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది లేడీస్‌ అండ్‌ జంటిల్‌మెన్‌ అనడం చూస్తుంటాం..! జపాన్‌లో ఇకనుంచి అలా కుదరదు.. ఇకపై ఆ విధంగా సంబోధించబోమని జపాన్‌ ఎయిర్‌లైన్స్‌ స్పష్టం చేసింది.. అందుకు కారణంగా విమానాశ్రయాలలో ప్రయాణికులకు లింగ్‌, వయసు, జాతి, ప్రాంతీయభేదాలు లేని వాతావరణం కల్పించాలని జపాన్‌ ప్రభుత్వం నిర్ణయించడమే! ఈ నేపథ్యంలోనే స్త్రీ, పురుష లింగ భేదాన్ని కనబర్చేట్టుగా ఉన్న లేడిస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌ పదాన్ని ఎయిర్‌లైన్స్‌ ఉపసంహరించుకుంది.. ఇక నుంచి ప్రయాణికులను ఎవ్రీవన్‌, ఆల్‌ ప్యాసింజర్స్‌ అని మాత్రమే సంబోధిస్తామని జపాన్‌ ఎయిర్‌లైన్స్‌ తెలిపింది. లేడిస్‌ అండ్‌ జెంటిల్‌మన్‌ అని పిలవడం చాలా మందికి నచ్చడం లేదని, ప్రయాణికులు కూడా ఈ పదం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని జపాన్‌ ఎయిర్‌లైన్స్‌ అంటోంది.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. ఇప్పటికే జపనీస్‌ లాంగ్వేజ్‌లోంచి జండర్‌ వివక్షను కనబర్చే పదాలను తొలగించింది ప్రభుత్వం..