చంద్రబాబుకు పవన్ ఫోన్..ఏం మాట్లాడారు..?

|

Oct 31, 2019 | 2:29 AM

ఏపీలో ఇసుక కొరతపై జనసేన ఆందోళనలకు సిద్దమైంది. ఈ విషయంలో పలు పక్షాలను కలుపుకుపోయేందుకు మార్గాలను అన్వేశిస్తుంది. ప్రజా సమస్యలపై పోరాటం విషయంలో బేషజాలు చూపనని గతంలోనే ప్రకటించిన పవన్ కళ్యాణ్..ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల గురించి జనసేనాని పలు పార్టీల నాయకులతో ఫోన్ సంభాషణలు జరిపారు. ఎటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించగలమని అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా ఆయన టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబుకు పవన్ […]

చంద్రబాబుకు పవన్ ఫోన్..ఏం మాట్లాడారు..?
Follow us on

ఏపీలో ఇసుక కొరతపై జనసేన ఆందోళనలకు సిద్దమైంది. ఈ విషయంలో పలు పక్షాలను కలుపుకుపోయేందుకు మార్గాలను అన్వేశిస్తుంది. ప్రజా సమస్యలపై పోరాటం విషయంలో బేషజాలు చూపనని గతంలోనే ప్రకటించిన పవన్ కళ్యాణ్..ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల గురించి జనసేనాని పలు పార్టీల నాయకులతో ఫోన్ సంభాషణలు జరిపారు. ఎటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించగలమని అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా ఆయన టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబుకు పవన్ ఫోన్ చేసి మాట్లాడారు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కోసం అక్కడి రాజకీయపక్షాలు ఎలా ఉమ్మడి స్ఫూర్తి చూపుతున్నాయో..ఏపీలో ఇసుక సమస్య పరిష్కారానికి, లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు మళ్ళీ ఉపాధి లభించేలా సమైక్యంగా పోరాడాలని పవన్ అన్నారు. పవన్  విజ్ఞప్తిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.

ఇక ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా పవన్ చేసిన రిక్వెస్టుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది. నవంబర్ 3న విశాఖలో జనసేన ఇసుక కొరత, భవనిర్మాణ కార్మికుల కష్టాలపై ర్యాలీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.   సీపీఎం కార్యదర్శి మధు, సీపీఐ కార్యదర్శి రామకృష్ణ, ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి, లోక్ సత్తా అధ్యక్షుడు డీవీవీఎస్ వర్మ, బీఎస్పీ అధ్యక్షుడు సంపత్‌రావుతో పవన్ మాట్లాడారు. ఇక ఎప్పట్నుంచో పవన్‌కు.. కమ్యునిష్టు పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. బీజేపీ కార్యకర్తలు మినహా ఏపీలోని అన్ని విపక్ష పార్టీలు జనసేన పిలుపుతో కలిసివచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక అన్ని వర్గాలు సపోర్ట్ లభిస్తే  జనసేన చేపట్టిన లాంగ్ మార్చ్​ హ్యూజ్ సక్సెస్ అవ్వడం ఖాయంగా తెలుస్తోంది.