బొగ్గు స్కామ్ కేసులో మాజీ కేంద్రమంత్రికి జైలు శిక్ష రద్దు

| Edited By: Pardhasaradhi Peri

Oct 27, 2020 | 8:25 PM

బొగ్గు స్కామ్ కేసులో మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రే కి మూడేళ్ళ జైలుశిక్షను ఢిల్లీ హైకోర్టు నిలిపివేసింది. ఈ కేసులో ఈయనకు సీబీఐ కోర్టు మొదట మూడేళ్ళ జైలు శిక్షను విధించింది. అయితే ఆ తరువాత లక్ష రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. ఝార్ఖండ్ లో 1999 లో బొగ్గు కేటాయింపులకు సంబందించి జరిగిన అవకతవకల్లో దిలీప్ రే కి ప్రమేయం ఉందని సీబీఐ తన రిపోర్టులో పేర్కొంది.  కాగా… ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులకు […]

బొగ్గు స్కామ్ కేసులో మాజీ కేంద్రమంత్రికి జైలు శిక్ష రద్దు
Follow us on

బొగ్గు స్కామ్ కేసులో మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రే కి మూడేళ్ళ జైలుశిక్షను ఢిల్లీ హైకోర్టు నిలిపివేసింది. ఈ కేసులో ఈయనకు సీబీఐ కోర్టు మొదట మూడేళ్ళ జైలు శిక్షను విధించింది. అయితే ఆ తరువాత లక్ష రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. ఝార్ఖండ్ లో 1999 లో బొగ్గు కేటాయింపులకు సంబందించి జరిగిన అవకతవకల్లో దిలీప్ రే కి ప్రమేయం ఉందని సీబీఐ తన రిపోర్టులో పేర్కొంది.  కాగా… ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.