Jai Lava Kusa movie : మరోసారి థియేటర్‌‌‌‌‌‌‌‌లో సందడి చేయనున్న జైలవకుశ.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టికెట్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తారక్ డ్యాన్స్ లకు ఫిదా కానీ ప్రేక్షకుడు ఉండడు. తారక్ డైలాగులకు థియేటర్స్ ఈలలు, గోలలు ఆ హడావిడి..

Jai Lava Kusa movie : మరోసారి థియేటర్‌‌‌‌‌‌‌‌లో సందడి చేయనున్న జైలవకుశ.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టికెట్స్

Updated on: Jan 27, 2021 | 10:26 AM

Jai Lava Kusa movie : యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తారక్ డ్యాన్స్ లకు ఫిదా కానీ ప్రేక్షకుడు ఉండడు. తారక్ డైలాగులకు థియేటర్స్ ఈలలు, గోలలు ఆ హడావిడి మాములుగా ఉండదు. ఎన్టీఆర్ సినిమా వస్తుందంటేనే అభిమానులకు పండగే.. ఇదిలా ఉంటే తారక్ నటించిన జై లవకుశ సినిమాను మరో సారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. జనవరి 28న ప్రసాద్ ఐమ్యాక్స్ లో `జై లవకుశ` స్పెషల్ ప్రీమయర్ వేయనున్నారు.

కాగా ఈ స్పెషల్ ప్రీమయర్ కు టికెట్లు భారీ అమ్ముడు పోయాయని తెలుస్తుంది. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేశారు. మూడు డిఫరెంట్ పాత్రల్లో ఎన్టీఆర్ నటన అద్భుతమనే చెప్పాలి. ఇప్పటికే ఓటీటీలో ఈ సినిమా అందుబాటులో ఉన్నా తారక్ అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లలో చూడటానికి సిద్ధమయ్యారంటే యంగ్ టైగర్ క్రేజ్ ఏంటో అర్ధమవుతుంది. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కొమరం భీమ్ గా తారక్ కనిపించనున్న విషయం తెలిసిందే.

మరిన్ని ఇక్కడ చదవండి : 

బాక్సాఫీస్ పోటీకి సిద్ధమైన బాలీవుడ్ స్టార్ హీరోలు.. సల్మాన్‏ను ఢీకొట్టనున్న జాన్ అబ్రహం..