అమరావతికి రూ.3 లక్షల కోట్లు అవుతుంది: జగన్

మూడు రాజధానుల బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ బాబు ఏకపక్షంగా చేయాలనుకున్నది చేసుకుంటూ పోయారన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి ఇక్కడకు వచ్చారన్నారు. ఇక్కడకు వచ్చి తనవారితో భూములు కొన్నారని చెప్పారు. అందరి దృష్టిని నూజివీడు, ఏఎన్‌యూ వైపు మళ్లించి అమరావతి ప్రాంతంలో చంద్రబాబు బినామీలు భూములు కొన్నారని జగన్‌ తెలిపారు. గత ప్రభుత్వ విధివిధానాలను జగన్ తీవ్రంగా దుయ్యబట్టారు. 5 ఏళ్లుగా చంద్రబాబు రాజధానికి ఏమీ చేయకుండా గ్రాఫిక్స్‌ చూపించారు. […]

అమరావతికి రూ.3 లక్షల కోట్లు అవుతుంది: జగన్

Edited By:

Updated on: Jan 20, 2020 | 10:50 PM

మూడు రాజధానుల బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ బాబు ఏకపక్షంగా చేయాలనుకున్నది చేసుకుంటూ పోయారన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి ఇక్కడకు వచ్చారన్నారు. ఇక్కడకు వచ్చి తనవారితో భూములు కొన్నారని చెప్పారు. అందరి దృష్టిని నూజివీడు, ఏఎన్‌యూ వైపు మళ్లించి అమరావతి ప్రాంతంలో చంద్రబాబు బినామీలు భూములు కొన్నారని జగన్‌ తెలిపారు.

గత ప్రభుత్వ విధివిధానాలను జగన్ తీవ్రంగా దుయ్యబట్టారు. 5 ఏళ్లుగా చంద్రబాబు రాజధానికి ఏమీ చేయకుండా గ్రాఫిక్స్‌ చూపించారు. అమరావతి కోసం చంద్రబాబు ఐదేళ్లలో ఖర్చు చేసింది. కేవలం రూ.5,674 కోట్లు మాత్రమే. చంద్రబాబు లెక్క ప్రకారం అమరావతికి లక్ష కోట్లు కావాలి. అన్ని సంక్షేమ పనులు ఆపేసి రాజధానిపై ఖర్చు చేసినా అమరావతి అభివృద్ధి 20 ఏళ్లు పడుతుంది. 20 ఏళ్లకు రాజధానికి చేసిన ఖర్చు అసలు, వడ్డీతో కలిసి రూ.3 లక్షల కోట్లు అవుతుంది  అని అన్నారు.