ఏపీ రైతుల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ గుడ్ న్యూస్..

|

Jul 25, 2020 | 12:21 AM

ఏపీ ప్ర‌భుత్వం రైతుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీ రైతుల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ గుడ్ న్యూస్..
Follow us on

ఏపీ ప్ర‌భుత్వం రైతుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా స్థాయిలో 13, నియోజకవర్గాల స్థాయిలో 147, ప్రాంతీయ స్థాయిలో 4 వైఎస్ఆర్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటుకు అనుమ‌తులు ల‌భించాయి. విశాఖ, గుంటూరు, ఏలూరు, తిరుపతి నగరాల్లో 4 ప్రాంతీయ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ల్యాబ్స్ ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల క్వాలిటీ ప‌రిశీలించ‌నున్నారు.

ఇందుకు సంబంధించి రూ.197 కోట్లతో ప్రాజెక్టు రిపోర్టును ఏపీ స‌ర్కార్ నాబార్డుకు సమర్పించింది. నాబార్డు గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి కింద రూ.150 కోట్లు ఇప్ప‌టికే రిలీజ్ చేసింది.