ఏపీ సీఎం వైఎస్ జగన్ పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ పరిపాలనను ముందుకు సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మూగ జీవాలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ‘వైఎస్సార్ పశు సంరక్షణ పధకానికి శ్రీకారం చుట్టారు. ఈ పధకం ద్వారా పశువులు కలిగిన రైతులు. గొర్రెల, మేకల కాపరులు, యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవనుంది.
మూగజీవులకు హెల్త్ కార్డులను జారీ చేసి.. వాటి సంరక్షణను చూసుకోనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పశువైద్య సహాయకులను అందుబాటులో ఉంచనున్నారు. అంతేకాకుండా సమస్యలు పరిష్కారం కోసం పశుసవర్ధకశాఖ టోల్ ఫ్రీ నెంబర్ 085-00-00–1962, లేదా రైతు భరోసా కేంద్రాల టోల్‌ఫ్రీ నెంబర్ 1907కు కాల్ చేయాలని సూచించారు.
వైఎస్ఆర్ పశునష్టపరిహర పధకం వివరాలు ఇలా ఉన్నాయి..