జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఏపీ స్టేట్ కోవిడ్ హాస్పిటల్ ఎత్తివేత.. నేటి నుంచి అన్ని రకాల వైద్య సేవలు ఆరంభం..

సుమారు ఎనిమిది నెలల తర్వాత కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సాధారణ వైద్య సేవలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఏపీ స్టేట్ కోవిడ్ హాస్పిటల్ ఎత్తివేత.. నేటి నుంచి అన్ని రకాల వైద్య సేవలు ఆరంభం..

Updated on: Dec 07, 2020 | 8:21 AM

AP State Covid Hospital: సుమారు ఎనిమిది నెలల తర్వాత కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సాధారణ వైద్య సేవలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గతంలో కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల సేవలను నిలిపివేశారు . కేవలం అత్యవసర సేవలను మాత్రమే కొనసాగించారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతుండటంతో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి స్టేట్ కోవిడ్ హాస్పిటల్‌ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.

నేటి నుంచి అన్ని రకాల వైద్య సేవలు పేషెంట్లకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. రోజూ అన్ని విభాగాల ఓపీ ఎప్పటిలానే కొనసాగుతుందని.. శస్త్ర చికిత్సలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. కాగా, ప్రస్తుతం ఏపీవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,71,972కు చేరుకుంది. ఇందులో 5,910 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,59,029 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఈ మహమ్మారి కారణంగా 7,033 మంది ప్రాణాలు విడిచారు.