జగన్ ఫ్యామిలీ @ హైదరాబాద్ కోర్ట్స్

|

Jan 09, 2020 | 6:19 PM

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబం మొత్తం జనవరి పదో తేదీన హైదరాబాద్ కోర్టుల్లో హాజరు కానున్నది. ముఖ్యమంత్రి హోదాలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరితే తిరస్కరించిన సీబీఐ కోర్టు జనవరి 10న జగన్ కచ్చితంగా హాజరు కావాలని ఆదేశించింది. దాంతో ఆయన హైదరాబాద్ సీబీఐ కోర్టులో హాజరు కానున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారం ఏపీ సీఎంఓ నుంచి రావడంతో నాంపల్లిలోని సీబీఐ కోర్టు వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత వ్యక్తిగత హాజరు […]

జగన్ ఫ్యామిలీ @ హైదరాబాద్ కోర్ట్స్
Follow us on

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబం మొత్తం జనవరి పదో తేదీన హైదరాబాద్ కోర్టుల్లో హాజరు కానున్నది. ముఖ్యమంత్రి హోదాలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరితే తిరస్కరించిన సీబీఐ కోర్టు జనవరి 10న జగన్ కచ్చితంగా హాజరు కావాలని ఆదేశించింది. దాంతో ఆయన హైదరాబాద్ సీబీఐ కోర్టులో హాజరు కానున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారం ఏపీ సీఎంఓ నుంచి రావడంతో నాంపల్లిలోని సీబీఐ కోర్టు వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

తొలుత వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునివ్వాలని గురువారం మరోసారి జగన్ పిటీషన్ దాఖలు చేస్తారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేశారు. అయితే.. ఆయన మినహాయింపు పిటీషన్ వేయకుండా కోర్టు ఆదేశాలను పాటించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. జగన్‌తో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి కూడా సీబీఐ కోర్టుకు రానున్నారు. ముఖ్యమంత్రి హోదాలో సీబీఐ కోర్టుకు రానుండడంతో ఆయన కోసం ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలంగాణ పోలీసులు నిర్ణయించారు. ఆ మేరకు సిటీ పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

కాగా.. 2012 ఉప ఎన్నికల సందర్భంగా పరకాలలో నమోదైన మరో కేసులో వైఎస్ విజయమ్మ, షర్మిల తదితరులు కూడా జనవరి 10న (శుక్రవారం) హైదరాబాద్ కోర్టులో హాజరు కానున్నారు. వీరిద్దరు హాజరయ్యే కోర్టు కూడా నాంపల్లిలోనే వుంది. 2012 పరకాల ఉప ఎన్నికల సందర్భంగా పోలీసుల అనుమతి లేకుండా రోడ్డుపై సభ నిర్వహించారన్న ఆరోపణలతో నమోదైన కేసులో షర్మిల, విజయమ్మ నాంపల్లి కోర్టుకు రానున్నారు. వీరిద్దరితోపాటు కొండా మురళి, కొండా సురేఖ కూడా ఈ కేసులో నాంపల్లి కోర్టులో హాజరవుతారు. ఏపీ ముఖ్యమంత్రి ఫ్యామిలీ కోర్టులకు హాజరు కానుండడంతో నాంపల్లి కోర్టు ఆవరణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.