
INDIA VS AUSTRALIA 2020 : టీం ఇండియాకు కొత్త సంవత్సరం కలిసి రావడం లేదు. ఆటగాళ్లు గాయాలపాలవుతున్నారు. దీంతో బ్రిస్బేన్ టెస్ట్‌కు కొంతమంది ఆటగాళ్లు అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. తాజాగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఎడమచేతి బొటనవేలు పక్కకు తిరగడంతో, ఎముక విరిగిందని పేర్కొన్నారు. బ్యాటింగ్ గ్లోవ్స్ తొడుక్కోవడమూ కష్టమేనని వెల్లడించారు. కాగా యువ వికెట్‌కీపర్ రిషభ్ పంత్ మాత్రం మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తాడని తెలిపారు. ఆతిథ్య జట్టు పేసర్లు విసిరిన షార్ట్‌పిచ్ బంతులకు వీరిద్దరూ గాయపడటంతో స్కానింగ్ చేయించిన సంగతి తెలిసిందే.
‘రవీంద్ర జడేజా ఎడమ బొటనవేలు పక్కకు వంగడంతో ఎముక విరిగిపోయింది. అతడు గ్లోవ్స్ వేసుకొని బ్యాటింగ్ చేయడం కష్టం. అతడు రెండుమూడు వారాలు క్రికెట్ ఆడలేడు. అంటే నాలుగో టెస్టుకు అందుబాటులో ఉండడు. పంత్ మాత్రం బ్యాటింగ్ చేయగలడు. అతడి గాయం అంత తీవ్రమైందేమీ కాదు’ అని బీసీసీఐలోని ఓ అధికారి పీటీఐకి తెలిపారు. తొలి ఇన్నింగ్స్‌లో వేగంగా పరుగులు చేసిన జడ్డూ గ్లోవ్స్‌ను మిచెల్ స్టార్క్ విసిరిన బంతి తాకింది. దాంతో అతడు గాయపడ్డాడు. రిషభ్ పంత్ బ్యాటింగ్ చేస్తుండగా అతడి ఎడమ మోచేతికి కమిన్స్ విసిరిన బౌన్సర్ తగిలింది. దాంతో అతడినీ స్కానింగ్‌కు పంపించారు. పంత్ 67 బంతుల్లో 36 పరుగులు చేశాడు. వేగంగా ఆడుతున్న క్రమంలో గాయపడటంతో క్రీజులో సరిగ్గా కదల్లేకపోయాడు.
ఆసీస్‌ను వారి గడ్డపై కొట్టడం అంత ఈజీ కాదు.. అడిలైడ్ తొలిటెస్ట్‌పై వేణుగోపాల్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు