Ivanka Trump: అహ్మదాబాద్‌లో మెరిసిన ‘చంద్రవంక’ !

| Edited By: Pardhasaradhi Peri

Feb 24, 2020 | 1:59 PM

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ సోమవారం అహ్మదాబాద్ చేరుకున్నారు. సర్దార్ వల్లభ భాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తన భర్త జె.కుష్నర్ తో కలిసి విమానం దిగిన ఈ దంపతులకు ప్రధాని మోడీ సాదర స్వాగతం పలికారు.

Ivanka Trump: అహ్మదాబాద్‌లో మెరిసిన చంద్రవంక !
Follow us on

Ivanka Trump:  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ సోమవారం అహ్మదాబాద్ చేరుకున్నారు. సర్దార్ వల్లభ భాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తన భర్త జె.కుష్నర్‌తో కలిసి విమానం దిగిన ఈ దంపతులకు ప్రధాని మోడీ సాదర స్వాగతం పలికారు. రెడ్ ఫ్లోరల్ ప్రింట్స్ కలిసిన పౌడర్ బ్లూ మిడీ  డ్రెస్ లో మెరిసిన ఇవాంకా.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక ట్రంప్, ఆయన భార్య మెలనియాలకు ఎయిర్ పోర్టులో అనేకమంది కళాకారులు సంప్రదాయ నృత్యాలతో వెల్‌కమ్ చెప్పారు. గుజరాతీ సాంప్రదాయక దుస్తుల్లో అనేకమంది ఆర్టిస్టులు.. మోడీ, ట్రంప్ దంపతులు ప్రయాణించిన మార్గం పొడవునా తమ నృత్యాలతో అలరించారు. ఇవి ట్రంప్ దంపతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విమానాశ్రయం నించి ట్రంప్ కుటుంబం నేరుగా సబర్మతీ ఆశ్రమానికి బయల్దేరింది. కాగా- ఇండియాకు చేరుకున్న వెంటనే ఇవాంకా.. రెండేళ్ల అనంతరం ఈ దేశానికి రావడం తనకెంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య మైత్రి ఈ సందర్భంగా మరింత బలపడుతుందని ఆశిస్తున్నట్టు ఆమె తెలిపారు. 2017 లో ఈమె హైదరాబాద్ లో జరిగిన ఓ గ్లోబల్ సమ్మిట్ కు హాజరైన సంగతి విదితమే.