వ్యాక్సిన్‌ అన్ని దేశాలకు సమాన పంపిణీ పెద్ద సవాల్‌: సౌమ్య స్వామినాథన్‌

కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి 2021 ప్రారంభంలో మనం శుభవార్త వినవచ్చన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ అన్నారు. కరోనా వ్యాక్సిన్‌ను అన్ని దేశాలకు నిష్పక్షపాతంగా పంపిణీ చేయడం సవాల్‌తో కూడుకున్న విషయమన్నారు.

వ్యాక్సిన్‌ అన్ని దేశాలకు సమాన పంపిణీ పెద్ద సవాల్‌: సౌమ్య స్వామినాథన్‌

Updated on: Aug 27, 2020 | 10:08 AM

కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి 2021 ప్రారంభంలో మనం శుభవార్త వినవచ్చన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ అన్నారు. కరోనా వ్యాక్సిన్‌ను అన్ని దేశాలకు నిష్పక్షపాతంగా పంపిణీ చేయడం సవాల్‌తో కూడుకున్న విషయమన్నారు. బుధవారం ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ బెంగళూరు’(ఐఐఎంబీ)లో జరిగిన ఓ కార్యక్రమంలో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ఆమె పాల్గొన్నారు.

అయితే, వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చాక అన్ని దేశాలకు సమ ప్రాధాన్యత ముఖ్యమన్న ఆమె.. వ్యాక్సిన్ ను పంపిణీ చేయడం పెద్ద సవాల్‌తో కూడుకున్న విషయమని సౌమ్య స్వామినాథన్‌ తెలిపారు. ‘వ్యాక్సిన్ల తయారీ కేంద్రంగా భారత్‌కు ప్రంచవ్యాప్తంగా ఖ్యాతి గడించిందన్నారు. కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి దేశంలో ఇప్పటికే పలు కంపెనీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ రెండు విషయాలను పరిగణనలోకి తీసుకుంటే భారత్‌ మెరుగైన స్థితిలోనే ఉన్నట్లు ఆమె చెప్పారు. కరోనా నుంచి ప్రపంచ దేశాలకు త్వరలోనే విముక్తి కలుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు సౌమ్య.