బయటపడ్డ సుమారు వెయ్యేళ్ల నాటి బంగారు నాణేలు

| Edited By: Team Veegam

Sep 15, 2020 | 7:03 PM

సుమారు వెయ్యేళ్ల క్రితం నాటి బంగారు నాణేలను గుర్తించారు శాస్త్రవేత్తలు. అబ్బాసిద్ కాలానికి చెందిన 425 బంగారు నాణేలను గుర్తించినట్లు పురావస్తు శాస్త్రవేత్తలు వెలికి తీశారు. ఆగష్టు 18న ఈ నిధిని కనుగొన్నట్లు ఇజ్రాయెల్ పురాతన అథారిటీ తెలిపింది. ఇవి తొలి ఇస్లామిక్..

బయటపడ్డ సుమారు వెయ్యేళ్ల నాటి బంగారు నాణేలు
Follow us on

సుమారు వెయ్యేళ్ల క్రితం నాటి బంగారు నాణేలను గుర్తించారు శాస్త్రవేత్తలు. అబ్బాసిద్ కాలానికి చెందిన 425 బంగారు నాణేలను గుర్తించినట్లు పురావస్తు శాస్త్రవేత్తలు వెలికి తీశారు. ఆగష్టు 18న ఈ నిధిని కనుగొన్నట్లు ఇజ్రాయెల్ పురాతన అథారిటీ తెలిపింది. ఇవి తొలి ఇస్లామిక్ నాణేలని ఆంటిక్విటీస్ అథారిటీస్ పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు లియాత్ నడావ్-జివ్, ఎల హడ్డాడ్ ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. ఇంత మొత్తంలో అంత్యంత పురాతన నాణేలు దొరకడం ఇజ్రాయిల్‌లో మొదటిసారి అని అధికారులు పేర్కొన్నారు. ఇవి తొమ్మిదవ శాతాబ్దం చివరి కాలం నాటి నాణేలుగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. కాగా 2015లో కూడా 10, 11వ శాతాబ్దంలోని ఫాతిమిడ్ కాలానికి చెందిన పురాతన నగరమైన కైసర్ తీరంలో సుమారు రెండు వేల నాణేలను కనుగొన్నారు పురావస్తు శాస్త్రవేత్తలు.

Read More:

సరదాగా చేపలు పట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

ప్రముఖ సీనియర్ నటి ఇంట విషాదం

కాస్టింగ్ కౌచ్‌పై అనుష్క కీలక వ్యాఖ్యలు

డబ్బులు కావాలంటే కాల్ చేయండి.. ఏటీఎం ఇంటికే వచ్చేస్తుంది