ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) రసవత్తరంగా జరుగుతోంది. మ్యాచ్..మ్యాచ్ కు ఈక్వేషన్స్ మారపోతున్నాయి. ఆరంభంలో అంతగా ఆకట్టుకోలేకపోయిన గోవా ఎఫ్‌సీ జట్టు తిరిగి ట్రాక్ లోకి వచ్చింది. వరుసగా రెండు ఓటముల తర్వాత బుధవారం జరిగిన మ్యాచ్‌లో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. జంషెడ్‌పూర్ ఎఫ్‌సీతో గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో గోవా 2-1తో విజయం సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో గోవా ఎఫ్‌సీ మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 8 మ్యాచులు ఆడిన గోవా.. మూడు విజయాలు అందుకుని 11 పాయింట్లతో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది.
ఐఎస్‌ఎల్ 2020-21 సీజన్‌లో క్రిస్టమస్ పండగ నేపథ్యంల గురువారం, శుక్రవారం మ్యాచులు షెడ్యూల్ చేయలేదు. శనివారం ఈస్ట్ బెంగాల్, చెన్నయిన్ ఎఫ్‌సీ జట్ల తలపడబోతున‌్నాయి. ముంబై సిటీ 16 పాయింట్లతో పట్టికలో టాప్ ప్లేస్ లో కొనసాగుతుండగా.. ఏటీకే మోహన్ బగాన్ అదే 16 పాయింట్లతో సెంకడ్ ప్లేసులో ఉంది. బెంగళూరు ఎఫ్‌సీ (12), నార్త్ ఈస్ట్ యునైటెడ్ (11), గోవా ఎఫ్‌సీ (11) టాప్-5లో ఉన్నాయి.
Also Read :
PM Kisan: పీఎం కిసాన్… నగదు మీ ఖాతాల్లోకి పడ్డాయో లేదో ఎలా ఇలా చెక్ చేసుకోండి…
Tirumala News : వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఏడు కొండలవాడికి భారీ ఆదాయం..లాక్ డౌన్ తర్వాత ఇదే అత్యధికం