ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నీ ఏడో సీజన్ రసవత్తరంగా సాగుతోంది. తాజాగా నార్త్ ఈస్ట్ యునైటెడ్ టీమ్ రెండో విజయం తన ఖాతాలో వేసుకుంది. శనివారం ఈస్ట్ బెంగాల్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ 2-0 గోల్స్ తేడాతో విజయ కేతనం ఎగరవేసింది. మొదటి సగ భాగంలో 33వ నిమిషంలో ఈస్ట్ బెంగాల్ ఆటగాడు సుర్‌చంద్ర సింగ్ సెల్ఫ్ గోల్ చేయడంతో నార్త్ ఈస్ట్ టీమ్ బోణీ కొట్టింది. ఆ తర్వాత స్కోర్ సమం చేసేందుకు ఈస్ట్ బెంగాల్ విశ్వ ప్రయత్నాలు చేసినా..విజయవంతం కాలేకపోయింది.
మరోవైపు యునైటెడ్ టీమ్ కూడా ఆట రెండో సగభాగం పూర్తయ్యే వరకూ ఇంకో గోల్ చేయలేకపోయింది. అయితే ఇంజ్యూరీ సమయం మొదలైన వెంటనే(90వ నిమిషం) రైట్ ఫ్లాంక్ నుంచి సుహైర్ ఇచ్చిన లాంగ్ పాస్ అందుకున్న రొచార్జెలా గోల్ కొట్టి మ్యాచ్‌ను గ్రాండ్‌గా ముగించాడు.
మొత్తం మీద నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, రెండు డ్రా సాధించిన నార్త్ ఈస్ట్ జట్టు 8 పాయింట్లతో రెండవ స్థానానికి ఎగబాకగా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ పరాజయం చెందిన ఈస్ట్ బెంగాల్ చివరి స్థానంలో ఉంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో ముంబైతో ఒడిశా… గోవాతో కేరళ బ్లాస్టర్స్ ఢీకొంటున్నాయి.
Also Read :
రిటర్నింగ్ ఆఫీసర్ టీఆర్‌ఎస్ కొమ్ముకాసారు.. నేరెడ్‌మెట్ బీజేపీ అభ్యర్థి ప్రసన్న సంచలన ఆరోపణలు
అతిలోకసుందరి కూతురుకు క్రేజీ ఆఫర్స్ ఎందుకు రావడం లేదు, బాలీవుడ్ మేకర్స్ ప్రాబ్లం ఏంటి..?
యాంకర్ భామల ఫోటో షూట్లు : శీతాకాలంలో సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్నారు…