డొనాల్డ్ ట్రంప్ ను అరెస్టు చేయాలంటూ ఇరాక్ కోర్టు వారంట్ జారీ, అయితే సాధ్యమవుతుందా ? నిపుణుల సందేహాలు

త్వరలో పదవి నుంచి దిగిపోనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను అరెస్టు చేయాలంటూ ఇరాక్ లోని ఓ కోర్టు వారంట్  జారీ చేసింది. గత ఏడాది తమ దేశ సైనిక..

  • Umakanth Rao
  • Publish Date - 7:11 pm, Thu, 7 January 21
డొనాల్డ్ ట్రంప్ ను అరెస్టు చేయాలంటూ ఇరాక్ కోర్టు వారంట్ జారీ, అయితే సాధ్యమవుతుందా ? నిపుణుల సందేహాలు

Donald Trump: త్వరలో పదవి నుంచి దిగిపోనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను అరెస్టు చేయాలంటూ ఇరాక్ లోని ఓ కోర్టు వారంట్  జారీ చేసింది. గత ఏడాది తమ దేశ సైనిక  జనరల్ ను, పవర్ ఫుల్ మిలీషియా లీడర్ ను హతమార్చడంలో ఆయన పాత్ర ఉందని బాగ్దాద్ లోని ఇన్వెస్టిగేటివ్ కోర్టు పేర్కొంది. గత సంవత్సరం జనరల్ ఖాసిం సోలేమని. అబూ-మెహదీ అల్-మొహందిస్ అనే మిలటరీ లీడర్ ను డ్రోన్ ద్వారా దాడి చేయించి ట్రంప్ హతమార్చారని  ఈ కోర్టు పేర్కొంది. బాగ్దాద్ విమానాశ్రయంలో వీరు డ్రోన్ ఎటాక్ లో మృతి చెందారు.ఈ నేరానికి గాను దోషికి మరణ శిక్ష విధించాల్సి ఉంటుంది. అయితే పదవి నుంచి ట్రంప్ దిగిపోతున్న తరుణంలో ఈ శిక్షను అమలు చేస్తారా అని నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అబూ-మెహదీ కుటుంబ సభ్యుల వాంగ్మూలం ఆధారంగా ఇరాక్ కోర్టు ఈ అరెస్ట్ వారంట్ జారీ చేసింది. కాగా ఈ ఇద్దరి హత్యలతో ఇరాక్-అమెరికా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బ తిన్నాయి.

Also Read:

నాగార్జునసాగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డి, వెల్లడించిన కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్‌

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసుః అరెస్ట్‌పై అఖిలప్రియ చెల్లెలు ఆసక్తికర వ్యాఖ్యలు.. అసలైన నిందితులను కఠినంగా శిక్షించాలిః మౌనికారెడ్డి

కార్ డిజైనర్ దిలీప్ చాబ్రియాపై ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ ఫిర్యాదు, రూ. 5.5 కోట్ల చీటింగ్.