నాగార్జునసాగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డి, వెల్లడించిన కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్‌

నాగార్జునసాగర్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా జానారెడ్డి పోటీ చేస్తారని కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్‌ చెప్పారు...

నాగార్జునసాగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డి, వెల్లడించిన కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్‌
Follow us

|

Updated on: Jan 07, 2021 | 7:04 PM

నాగార్జునసాగర్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా జానారెడ్డి పోటీ చేస్తారని కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్‌ చెప్పారు. ఉపఎన్నికలో పోటీచేసేందుకు జానారెడ్డి అంగీకరించారని ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని స్వయంగా చెప్పిన ఠాగూర్…ఉప ఎన్నికకు కొన్ని వారాలే సమయం ఉన్నందున అప్పటిదాకా పీసీసీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ నిలిపివేయాలని అధినాయకత్వం నిర్ణయించిందన్నారు. జానారెడ్డి అభ్యర్థనపై పీసీసీ మాజీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఏఐసీసీ కార్యదర్శులతో చర్చించింది పార్టీ నాయకత్వం.

అందరూ జానా అభిప్రాయంతో ఏకీభవించటంతో.. తెలంగాణ పీసీసీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియను బై ఎలక్షన్‌ పూర్తయ్యేదాకా హోల్డ్‌లో పెట్టాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. కొత్త అధ్యక్షుడి ఎన్నికదాకా…పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలో…పాత కమిటీనే పార్టీ బాధ్యతలు చూస్తుందన్నారు మాణిక్కంఠాగూర్‌. సాగర్‌ ఎన్నికల తర్వాత 2023 సాధారణ ఎన్నికలకు కాంగ్రెస్‌ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతుందన్నారు. సంప్రదింపులు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని, తుది నిర్ణయం మాత్రం అధినేత్రిదేనని చెప్పారు.