ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీలు

|

Oct 13, 2020 | 2:10 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ఆపరేషన్స్ అదనపు డైరెక్టర్ జనరల్‌గా...

ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీలు
Follow us on

IPS officers transfers in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ఆపరేషన్స్ అదనపు డైరెక్టర్ జనరల్‌గా ఆర్.కే.మీనాను నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. 1995 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన మీనా.. గత కొంత కాలంగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఏసీబీ డైరెక్టర్ శంఖ బ్రత బాగ్చి బదిలీ అయ్యారు. ఆయన్ను ఏపీఎస్పి బెటాలియన్ ఐజీగా నియమించారు. బాగ్చి 1996 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన వారు.

గత కొంత కాలంగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న 2005 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి త్రివిక్రమ్ వర్మను గుంటూరు రేంజ్ డిఐజీగా నియమించారు. ఇంటెలిజెన్స్ డీఐజీ విజయ కుమార్‌ను బదిలీ చేశారు. ఆయన్ను హోం శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. ఆయనది 2006 ఐపీఎస్ బ్యాచ్. 2010 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సుధీర్ కుమార్ రెడ్డిని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీగా నియమించారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ ఆదేశాలు జారీ చేశారు.