ఐపీఎల్ 2020: ఢిల్లీ క్యాపిటల్స్‌కు గట్టి ఎదురుదెబ్బ.!

తొలి మ్యాచ్‌కు ముందే ఢిల్లీ క్యాపిటల్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ ఇషాంత్‌ శర్మ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడు. అతను గాయం నుంచి కోలుకునేందుకు...

ఐపీఎల్ 2020: ఢిల్లీ క్యాపిటల్స్‌కు గట్టి ఎదురుదెబ్బ.!

Updated on: Sep 20, 2020 | 3:06 PM

తొలి మ్యాచ్‌కు ముందే ఢిల్లీ క్యాపిటల్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ ఇషాంత్‌ శర్మ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడు. అతను గాయం నుంచి కోలుకునేందుకు ఎక్కువ సమయం పట్టవచ్చని తెలుస్తోంది. ఇవాళ దుబాయ్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగానే ప్రాక్టీస్ సెషన్‌లో ఇషాంత్ తన వీపుకు గాయం చేసుకున్నట్లు సమాచారం. దీనితో ఈ రోజు జరగబోయే మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉండకపోవచ్చు. (Injury scare for Ishant Sharma)

కాగా, ఇటీవల ఇషాంత్ శర్మ కు గాయాల బెడద వేధిస్తోంది. వాటి వల్ల ఈ 32 ఏళ్ల పేసర్ కెరీర్ ప్రమాదంలో పడింది. ఇక అటు ఢిల్లీకి కసిగో రబాడా, మొహిత్ శర్మ, సామ్స్, అమిత్ మిశ్రా, నోర్తజే, ఆవేశ్ ఖాన్, కీమో పాల్, స్టోయినిస్‌ వంటి అద్భుతమైన పేసర్లు ఉండనే ఉన్నారు.

Also Read:

మందుబాబులకు మరో గుడ్ న్యూస్.. ఏపీలో బార్లకు గ్రీన్ సిగ్నల్..

శభాష్ సాయి తేజ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సుప్రీమ్ హీరో..

Loading...
Unable to load recommendations.
Follow Us