శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామికి అరుదైన ఆహ్వానం అందింది. బుధవారం ఆగస్టు 5, 2020 అయోధ్యలో జరిగే రామ మందిరం భూమి పూజలో పాల్గొనాలని చిన్న జీయర్ స్వామికి ఆహ్వానం అందింది. ప్రస్తతం చిన్నజీయర్ స్వామి చాతుర్మాస దీక్షలో ఉన్నారు. ఈ నెల 5న అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మాణానికి ప్రధాని మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరుగబోతోంది.
కరోనా మహమ్మారి నేపథ్యంలో అతి తక్కువమంది సమక్షంలో జరిగే భవ్య రామమందిరం నిర్మాణ శంకుస్థాపనకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అతి కొద్ది మంది అతిథులు హాజరవుతున్న ఈ కార్యక్రమానికి చిన్న జీయర్ స్వామికి ఆహ్వానం అందింది. అయితే, ఆయన చాతుర్మాస దీక్షలో ప్రస్తుతం కొనసాగుతున్నారు. దేశ వ్యాప్తంగా 150 మంది ప్రముఖ పీఠాధిపతులను మాత్రమే సెలెక్టు చేస్తారు. 150 మందిలో సాధు సముతులు, వివిధ ధార్మిక సంస్థలు ఉన్నాయి. అయితే, ప్రస్తుతం చిన్నజీయర్ స్వామి చాతుర్మాస దీక్షలో కొనసాగుతున్నారు.