ఇక చకచకా ‘దిశ’ హత్యాచార కేసు దర్యాప్తు.. ఏడు పోలీసు బృందాల ఏర్పాటు!

డాక్టర్ దిశ హత్యకేసు విచారణను వేగవంతం చేశారు. సీపీ సజ్జనార్ ఆదేశాల మేరకు పోలీసులు 7 బృందాలుగా ఏర్పాటయ్యారు. ఒక్కో బృందంలోనూ ఏడుగురు పోలీసులు చొప్పున ఉండగా.. కేసు ఇన్వెస్టిగేషన్ నుంచి ఛార్జ్ షీట్ దాఖలు వరకు వీరు సీన్ మొత్తాన్ని రీ-కన్‌స్ట్రక్షన్ చేయనున్నారు. నిందితుల విచారణకు డీసీపీ ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో ఒక బృందం పని చేయనుంది. సాక్ష్యాల సేకరణకు, ఫోరెన్సిక్, డీఎన్ఏల పరిశీలనకు మరో రెండు బృందాలు.. అలాగే లీగల్ ప్రొసీడింగ్స్, ప్రత్యేక సాక్షుల విచారణ, […]

ఇక చకచకా దిశ హత్యాచార కేసు దర్యాప్తు.. ఏడు పోలీసు బృందాల ఏర్పాటు!

Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 05, 2019 | 3:00 PM

డాక్టర్ దిశ హత్యకేసు విచారణను వేగవంతం చేశారు. సీపీ సజ్జనార్ ఆదేశాల మేరకు పోలీసులు 7 బృందాలుగా ఏర్పాటయ్యారు. ఒక్కో బృందంలోనూ ఏడుగురు పోలీసులు చొప్పున ఉండగా.. కేసు ఇన్వెస్టిగేషన్ నుంచి ఛార్జ్ షీట్ దాఖలు వరకు వీరు సీన్ మొత్తాన్ని రీ-కన్‌స్ట్రక్షన్ చేయనున్నారు.

నిందితుల విచారణకు డీసీపీ ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో ఒక బృందం పని చేయనుంది. సాక్ష్యాల సేకరణకు, ఫోరెన్సిక్, డీఎన్ఏల పరిశీలనకు మరో రెండు బృందాలు.. అలాగే లీగల్ ప్రొసీడింగ్స్, ప్రత్యేక సాక్షుల విచారణ, ఐడెంటిఫికేషన్ పీరియడ్, సీసీటీవీ వీడియోల అనాలసిస్, టెక్నికల్ ఎవిడెన్స్ ఎనాలిసిస్ వంటి అంశాలపై వేరువేరుగా బృందాలు ఏర్పాటయ్యాయి. సీన్ టూ సీన్ అనాలసిస్ , క్రైమ్ సీన్ రికన్స్ట్రక్షన్ కోసం మరో బృందం ఏర్పాటైంది. ఇకపోతే ఈ బృందాలు నెల రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నాయి.

మరోవైపు దిశ కేసులో దొరికిన కీలక సాక్ష్యాలను ఇప్పటికే పోలీసులు షాద్‌నగర్ కోర్ట్‌కు సమర్పించారు. బాధితురాలి కాళ్ళ పట్టీలు, వినాయకుని బంగారు లాకెట్, చున్నీ, డ్రెస్‌లో కొంత భాగం, చెప్పులు, ఐడెంటి కార్డులు వాటిల్లో ముఖ్యంగా ఉన్నాయి. కాగా, మరిన్ని ఆధారాల కోసం క్లూస్ టీమ్ లారీని మరోసారి క్షుణ్ణంగా పరిశీలించనుంది. ఇకపోతే దిశకు సంబంధించిన సెల్‌ఫోన్‌ను ఇప్పటికే క్లూస్ టీమ్ కనిపెట్టగా.. మరికాసేపట్లో దాన్ని వెలిక తీయనున్నారు.