జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడులకు అవకాశం!

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు దాడులు చేసేందుకు అవకాశం ఉందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. శ్రీనగర్‌, పుల్వామా జిల్లా అవంతిపొరాలో ఉగ్రదాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించాయి. సైన్యం శిబిరాల వద్ద అప్రమత్తంగా ఉండాలని బలగాలను హెచ్చరించింది. పుల్వామాలో ఫిబ్ర‌వ‌రి 14వ తేదీన సీఆర్‌పీఎప్ జ‌వాన్ల కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జ‌రిగిన విష‌యం విదితమే. ఈ ఉగ్రదాడుల్లో 40 మంది జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే.

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడులకు అవకాశం!

Updated on: May 17, 2019 | 6:17 PM

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు దాడులు చేసేందుకు అవకాశం ఉందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. శ్రీనగర్‌, పుల్వామా జిల్లా అవంతిపొరాలో ఉగ్రదాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించాయి. సైన్యం శిబిరాల వద్ద అప్రమత్తంగా ఉండాలని బలగాలను హెచ్చరించింది. పుల్వామాలో ఫిబ్ర‌వ‌రి 14వ తేదీన సీఆర్‌పీఎప్ జ‌వాన్ల కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జ‌రిగిన విష‌యం విదితమే. ఈ ఉగ్రదాడుల్లో 40 మంది జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే.

Loading...
Unable to load recommendations.
Follow Us