కరోనా లాక్ డౌన్: ఆ రాష్ట్రంలో అప్పుడే రోడ్డెక్కిన బస్సులు..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచం మొత్తం లాక్ డౌన్‌లో ఉండిపోయింది. అయితే.. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో మళ్లీ బస్సు సర్వీసులు ఎప్పుడు మొదలవుతాయనే

కరోనా లాక్ డౌన్: ఆ రాష్ట్రంలో అప్పుడే రోడ్డెక్కిన బస్సులు..

Edited By:

Updated on: Apr 25, 2020 | 9:18 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచం మొత్తం లాక్ డౌన్‌లో ఉండిపోయింది. అయితే.. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో మళ్లీ బస్సు సర్వీసులు ఎప్పుడు మొదలవుతాయనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇందుకోసం మరి కొన్ని నెలలు పట్టొచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే అసోం రాష్ట్రంలో మాత్రం మళ్లీ బస్సులు రోడ్డెక్కాయి. తొలిరోజు దాదాపు 12,600 మంది బస్సుల్లో తమ గమ్యస్థానాలు చేరుకోవచ్చని రవాణాశాఖ అంచనా వేస్తోంది. అయితే ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు రాకపోకలు లేకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది.

కాగా.. గువాహటి నుంచి దాదాపు 1700 వేల బస్సులు ప్రజారవాణాకు సిద్ధమయ్యాయి. అందులో 551 బస్సులు బర్పెట, 420 బస్సులు గోల్‌పర, 103 బస్సులు మోరీగావ్, 412 బస్సులు నాగావ్, 238 బస్సులు సొంటిపూర్‌కు ప్రయాణమవుతాయని తెలిపారు. అయితే రెడ్ జోన్ పరిధిలోని ప్రాంతాల్లో ప్రజలు ఎక్కడికి వెళ్లకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇది ఉంటే దేశంలో అతి తక్కువ కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న అసోంలో ఇప్పటివరకు 36 కేసులు నమోదయ్యాయి. వీరిలో 19 మంది ఈ వైరస్ నుంచి కోలుకోగా… ఒకరు చనిపోయారు.

[svt-event date=”25/04/2020,9:17PM” class=”svt-cd-green” ]