విజయవాడలో స్కెచ్.. హైదరాబాద్‌లో మర్డర్

| Edited By:

Jul 07, 2019 | 1:08 PM

కృష్ణా జిల్లాకు చెందిన ఐరన్ వ్యాపారి తేలప్రోలు రాంప్రసాద్ హత్య కలకలం రేపింది. హైదరాబాద్ పంజాగుట్టవద్ద జరిగిన ఈ హత్య కేసులో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. ఈ హత్య కృష్ణా జిల్లా కొండపల్లిలోగల కామాక్షి స్టీల్ ఫ్యాక్టరీ చుట్టుూ తిరుగుతోంది. విజయవాడలో స్కెచ్ వేసి హైదరాబాద్‌లో మర్డర్ చేసినట్టుగా భావిస్తున్నారు. సుపారీ గ్యాంగ్‌ సహాయంతోనే ఈ హత్య చేయించారని మ‌ృతుడు రాం ప్రసాద్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. బెజవాడ రౌడీ షీటర్ కోగంటి సత్యం ఈ హత్యకు కారణమని […]

విజయవాడలో స్కెచ్.. హైదరాబాద్‌లో మర్డర్
Follow us on

కృష్ణా జిల్లాకు చెందిన ఐరన్ వ్యాపారి తేలప్రోలు రాంప్రసాద్ హత్య కలకలం రేపింది. హైదరాబాద్ పంజాగుట్టవద్ద జరిగిన ఈ హత్య కేసులో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. ఈ హత్య కృష్ణా జిల్లా కొండపల్లిలోగల కామాక్షి స్టీల్ ఫ్యాక్టరీ చుట్టుూ తిరుగుతోంది. విజయవాడలో స్కెచ్ వేసి హైదరాబాద్‌లో మర్డర్ చేసినట్టుగా భావిస్తున్నారు. సుపారీ గ్యాంగ్‌ సహాయంతోనే ఈ హత్య చేయించారని మ‌ృతుడు రాం ప్రసాద్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. బెజవాడ రౌడీ షీటర్ కోగంటి సత్యం ఈ హత్యకు కారణమని కూడా ఆరోపిస్తున్నారు.

కొండపల్లిలో రాంప్రసాద్ నిర్వహిస్తున్న కామాక్షి స్టీల్ కంపెనీలో భాగస్వామిగా ఉన్న కోగంటి సత్యం రూ.50 కోట్లు బాకీ పడ్డాడు. అయితే ఆ డబ్బును తిరిగి ఇవ్వకపోవడం ఇద్దరిమధ్య వివాదానికి కారణమైంది. అయితే తనకు ఇవ్వాల్సిన బాకీ చెల్లించాలని రాం ప్రసాద్ ఎంత పట్టుబట్టినా ప్రయోజనం లేకపోవడంతో కోర్టులో కేసువేశాడు. ఈ నేపధ్యంలోనే హత్యకు కోగంటి సత్యం పక్కా ప్లాన్ చేసి చంపినట్టుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే కోగంటి సత్యం నుంచి తనకు ప్రాణహాని ఉందని భావించిన రాం ప్రసాద్ హైదరాబాద్‌కు మకాం మార్చినట్టుగా తెలుస్తోంది. అయితే హైదరాబాద్‌కు వచ్చిన పది రోజులకే ఇలా హత్యకు గురయ్యాడు.

ఇదిలా ఉంటే రాంప్రసాద్ హత్య వార్త విజయవాడలో కలకలం సృష్టించింది. ఈ హత్యకు కారణంగా భావిస్తున్న కోగంటి సత్యంపై గతంలో పలు కేసులు కూడా విజయవాడ పటమట పోలీస్‌స్టేషన్‌లో నమోదయ్యాయి. అతనిపై రౌడీషీట్ కూడా ఉండటంతో ప్రతి ఆదివారం పటమట పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాల్సి ఉన్నా హాజరుకాలేదు. దీంతొ పోలీసులు కోగంటి ఇంటికి వెళ్లి సోదాలు చేసి కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే తాము కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్లామని, సత్యం మాత్రం తమతో రాలేదని, హైదరాబాద్ వెళ్తున్నట్టుగా చెప్పాడని కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు.

మరోవైపు రాం ప్రసాద్ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూనే లొంగిపోయేందుకు కోగంటి సత్యం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. 2003 నుంచి మృతుడు రాంప్రసాద్‌కు తనకు మధ్య ఆర్ధికపరమైన లావాదేవీలున్నట్టుగా చెబుతున్నాడు.మరోవైపు రాం ప్రసాద్ తనకు రూ.70 కోట్ల మేర నష్టం చేసాడని కూడా ఆరోపిస్తున్నాడు కోగంటి సత్యం. ప్రస్తుతం అఙ్ఞాతంలో ఉన్న కోగంటి సత్యం తెలంగాణలో ఓ ప్రముఖ రాజకీయ నేత ఆశ్రయం పొందినట్టుగా వార్తలు వస్తున్నాయి.