వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న యంగ్ హీరో… శర్వానంద్ నెక్స్ట్ మూవీ ఆ దర్శకుడితోనేనా…

టాలీవుడ్ లో అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ. సింపుల్ కథను తనదైన స్రీన్ ప్లేతో అందంగా తెరకెక్కిస్తుంటారు ఇంద్రగంటి.

  • Rajeev Rayala
  • Publish Date - 7:47 am, Tue, 4 May 21
వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న యంగ్ హీరో... శర్వానంద్ నెక్స్ట్ మూవీ ఆ దర్శకుడితోనేనా...
Sharwanand

sharwanand: టాలీవుడ్ లో అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ. సింపుల్ కథను తనదైన స్రీన్ ప్లేతో అందంగా తెరకెక్కిస్తుంటారు ఇంద్రగంటి. ఇటీవల నాని, సుధీర్ బాబులతో కలిసి వి అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో నాని  ఉన్నపాత్రలో కనిపించగా సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయం సాధించలేక పోయింది. ఇక ఇప్పుడు సుధీర్ బాబు హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు ఇంద్రగంటి. సుధీర్ బాబు కోసం మరో విలక్షణ సబ్జెక్ట్ ని ఎంచుకున్నారని తెలుస్తుంది.

ఇక సుధీర్ బాబు తర్వాత ఇంద్రగంటి యంగ్ హీరో శర్వానంద్ తో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. శర్వా కోసం ఇప్పటికే ఓ మంచి కథను కూడా సిద్ధం చేసాడట ఈ డైరెక్టర్. ఇక శర్వా ఇటీవల శ్రీకారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. ప్రస్తుతం ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతితో మహాసముద్రం అనే సినిమా చేస్తున్నాడు. అలాగే ఆడాళ్లు మీకు జోహార్లు  అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఇంద్రగంటి తో శర్వానంద్ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తుంది. మరో వైపు ఇంద్రగంటి నాగచైతన్య తో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. నాగచైతన్య థాంక్యూ లో నటించాక ఇంద్రగంటితో సినిమా చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Keerthy Suresh: జాతీయ ఉత్త‌మ న‌టి కీర్తి సురేశ్ తొలి సంపాద‌న రూ. 500.. ఆ డ‌బ్బు ఎవ‌రికిచ్చారంటే..

కరోనా పోరులో మేము సైతం అంటున్న టాలీవుడ్ హీరోలు.. ప్లాస్మా దానం చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్న తారలు..

‘ఇందువదన’ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో.. నయా లుక్కులో వరుణ్ సందేశ్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..