సరిహద్దులో పావురం కలకలం – పాకిస్తాన్ కుట్రను చేధించిన భారత్..!

|

May 25, 2020 | 7:41 PM

కరోనాతో ప్రపంచం ఓ వైపు అతలాకుతమవుతుంటే.. దాయాది దేశం పాకిస్తాన్ కుయుక్తులకు పాల్పడుతోంది. పాకిస్తాన్‌ గూఢచార పావురాన్ని మన దేశానికి పంపి మన గుట్టు తెలుసుకునేందుకు పన్నాగం పన్నింది. దీంతో అలర్టైన భద్రతా సిబ్బంది పావురాన్ని స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దుల్లో అనుమానాస్పదంగా కనిపించిన ఒక గూఢచార పావురాన్నికథువా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారత్-పాకిస్తాన్‌ సరిహద్దులో సోమవారం ఈ పావురం దొరికినట్లు పోలీసులు తెలిపారు. ఈ పావురం కాలికి చిన్న రింగు, ఆ రింగు మీద కోడ్‌ […]

సరిహద్దులో పావురం కలకలం - పాకిస్తాన్ కుట్రను చేధించిన భారత్..!
Follow us on

కరోనాతో ప్రపంచం ఓ వైపు అతలాకుతమవుతుంటే.. దాయాది దేశం పాకిస్తాన్ కుయుక్తులకు పాల్పడుతోంది. పాకిస్తాన్‌ గూఢచార పావురాన్ని మన దేశానికి పంపి మన గుట్టు తెలుసుకునేందుకు పన్నాగం పన్నింది. దీంతో అలర్టైన భద్రతా సిబ్బంది పావురాన్ని స్వాధీనం చేసుకున్నారు.
సరిహద్దుల్లో అనుమానాస్పదంగా కనిపించిన ఒక గూఢచార పావురాన్నికథువా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారత్-పాకిస్తాన్‌ సరిహద్దులో సోమవారం ఈ పావురం దొరికినట్లు పోలీసులు తెలిపారు. ఈ పావురం కాలికి చిన్న రింగు, ఆ రింగు మీద కోడ్‌ నెంబర్లు ఉండటంతో అది కచ్చితంగా పాకిస్తాన్‌ గూఢచార పావురమేనని పోలీసులు చెబుతున్నారు.
జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లా మన్యారి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులకు హిరానగర్‌ సెక్టార్‌ వద్ద ఒక పావురం కిందపడిపోయి కనిపించింది. వారు ఆ పావురాన్ని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. ఆ పావురం పాకిస్తాన్‌ వైపు ఎగురుతూ కింద పడిపోయిందని మన్యారి గ్రామస్తులు తెలిపారు. ఆ పావురాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులకు దాని కాలుకు ఉన్న చిన్న రింగు కంటపడింది. ఆ రింగుపై ప్రత్యేక కోడింగ్‌తో కూడిన సంఖ్యలు ఉండటంతో అది పాకిస్తాన్‌ గూఢచార కపోతంగా కథువా జిల్లా ఎస్పీ శైలేంద్రమిశ్రా నిర్ధారించారు. అనంతరం ఆ పావురాన్నిసంబంధిత ఆర్మీ అధికారులకు అప్పగించారు.