ప్రముఖ కమెడియన్‌పై ఆరు నెలల నిషేధం..

Indigo Banned Star Comedian: ప్రముఖ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాపై ఇండిగో విమానయాన సంస్థ 6 నెలల నిషేధాన్ని విధించింది. ఆయన ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామిపై ఇండిగో విమానంలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ సంస్థ ఈ నిర్ణయానికి వచ్చింది. మంగళవారం ముంబై- లక్నో ఇండిగో విమానంలో కునాల్ కమ్రా, అర్నబ్ గోస్వామిలు ఇద్దరూ ప్రయాణించారు. ఇక అప్పుడే ఈ స్టాండప్ కమెడియన్ అర్నబ్‌ను ఉద్దేశించి ‘నువ్వు పిరికిపందవా? లేక జర్నలిస్టువా?’ అంటూ దుర్భాషలాడాడు. […]

ప్రముఖ కమెడియన్‌పై ఆరు నెలల నిషేధం..

Updated on: Jan 29, 2020 | 1:29 PM

Indigo Banned Star Comedian: ప్రముఖ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాపై ఇండిగో విమానయాన సంస్థ 6 నెలల నిషేధాన్ని విధించింది. ఆయన ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామిపై ఇండిగో విమానంలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ సంస్థ ఈ నిర్ణయానికి వచ్చింది. మంగళవారం ముంబై- లక్నో ఇండిగో విమానంలో కునాల్ కమ్రా, అర్నబ్ గోస్వామిలు ఇద్దరూ ప్రయాణించారు. ఇక అప్పుడే ఈ స్టాండప్ కమెడియన్ అర్నబ్‌ను ఉద్దేశించి ‘నువ్వు పిరికిపందవా? లేక జర్నలిస్టువా?’ అంటూ దుర్భాషలాడాడు.

అంతేకాక ఈ వ్యవహారాన్ని మొత్తం ఓ వీడియో రూపంలో  తీసి.. దాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇక అది కాస్తా వైరల్ అయింది. దానితో స్పందించిన ఇండిగో సంస్థ కునాల్‌పై 6 నెలల నిషేధాన్ని విధించింది. అటు కేంద్ర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా ఇండిగో తరహాలో ఇతర విమానయాన సంస్థలు కూడా కమ్రాపై నిషేధం విధించాలని కోరారు.