భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

| Edited By:

Jun 06, 2019 | 4:28 PM

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీరేట్లను తగ్గించడం దేశీయ మార్కెట్లను కుదిపేసింది. బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లు అమాంతం పడిపోవడంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఫలితంగా సూచీలు కుప్పకూలాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ ఏకంగా 553 పాయింట్లకు పైగా నష్టంతో 40వేల మార్క్‌ను కోల్పోగా.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 11,843 వద్ద‌ ట్రేడ్‌ అయ్యింది. సూచీలు ఒక రోజులో అత్యధిక నష్టాన్ని చవిచూడటం ఈ ఏడాదిలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. నిఫ్టీ […]

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Follow us on

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీరేట్లను తగ్గించడం దేశీయ మార్కెట్లను కుదిపేసింది. బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లు అమాంతం పడిపోవడంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఫలితంగా సూచీలు కుప్పకూలాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ ఏకంగా 553 పాయింట్లకు పైగా నష్టంతో 40వేల మార్క్‌ను కోల్పోగా.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 11,843 వద్ద‌ ట్రేడ్‌ అయ్యింది. సూచీలు ఒక రోజులో అత్యధిక నష్టాన్ని చవిచూడటం ఈ ఏడాదిలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.

నిఫ్టీ 50లో గెయిల్‌ షేర్లు అత్యధికంగా 12శాతం నష్టపోగా.. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ షేర్లు 4-8 శాతం నష్ట‌పోయాయి. కోల్‌ఇండియా, టైటాన్‌, హీరో మోటార్స్‌ తదితర షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి.