రెండేళ్లలో నీటి అడుగున మెట్రో.. ఎక్కడో తెలుసా.?

|

Jan 29, 2020 | 2:42 PM

India’s Oldest Metro: కోల్‌కత్తా మెట్రో సంస్థ మరో ముందడుగు వేయనుంది. దేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ రైల్ ప్రాజెక్ట్ మార్చి 2022కు పూర్తి కానుంది. 1984లో హుగ్లీ నది అడుగున ప్రారంభమైన ఈ ప్రాజెక్టు నిర్మాణం ఎన్నో అడ్డంకులను దాటుకుని చివరి దశకు చేరుకుంది. ఫైనల్ ఇన్‌స్టాల్‌మెంట్ కింద రైల్వేస్ నుంచి రావాల్సిన రూ.20 కోట్ల కోసం వేచి చూస్తున్నామని కోల్‌కత్తా మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మానస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్లడించారు. సుమారు 10 […]

రెండేళ్లలో నీటి అడుగున మెట్రో.. ఎక్కడో తెలుసా.?
Follow us on

India’s Oldest Metro: కోల్‌కత్తా మెట్రో సంస్థ మరో ముందడుగు వేయనుంది. దేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ రైల్ ప్రాజెక్ట్ మార్చి 2022కు పూర్తి కానుంది. 1984లో హుగ్లీ నది అడుగున ప్రారంభమైన ఈ ప్రాజెక్టు నిర్మాణం ఎన్నో అడ్డంకులను దాటుకుని చివరి దశకు చేరుకుంది. ఫైనల్ ఇన్‌స్టాల్‌మెంట్ కింద రైల్వేస్ నుంచి రావాల్సిన రూ.20 కోట్ల కోసం వేచి చూస్తున్నామని కోల్‌కత్తా మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మానస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్లడించారు. సుమారు 10 వేల కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ 49 శాతం నిధులను సమకూర్చిందని తెలిపారు.

1984లో మొదలైన ఈ ఓల్డ్ మెట్రో ప్రాజెక్ట్.. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంది. అనుకున్న రూట్ ప్లాన్ కూడా మారిపోవడంతో అంచనా వ్యయం రెట్టింపు అయింది. మొదటిగా 14 కిలోమీటర్లకు గానూ రూ.49 బిలియన్లు ఖర్చవుతాయని అనుకున్నాం.. కానీ ఆ లెక్కలు తారుమారవడంతో చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇక చివరికి ప్రాజెక్టు వ్యయం రూ.86 బిలియన్లుగా మారింది. కాగా, ఈ మెట్రో అందుబాటులోకి వస్తే సుమారు 9 లక్షల మంది ప్రజలు రోజూ ప్రయాణిస్తారు. అంతేకాక హౌరా బ్రిడ్జి‌ని అతి తక్కువ సమయంలోనే దాటేయొచ్చునని మానస్ సర్కార్ స్పష్టం చేశారు.