సాధారణ రైళ్ల రాకపోకల తిరిగి ప్రారంభమయ్యేది ఎప్పుడంటే.? కీలక ప్రకటన చేసిన రైల్వే శాఖ.!!

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మార్చిలో కేంద్రం దేశమంతా లాక్‌డౌన్ ప్రకటించింది. కొన్ని నెలలు పూర్తి స్థాయిలో రైలు సర్వీసులను నిలిపివేసినా..

  • Ravi Kiran
  • Publish Date - 12:05 am, Sat, 19 December 20
సాధారణ రైళ్ల రాకపోకల తిరిగి ప్రారంభమయ్యేది ఎప్పుడంటే.? కీలక ప్రకటన చేసిన రైల్వే శాఖ.!!

Indian Railways Key Announcement: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మార్చిలో కేంద్రం దేశమంతా లాక్‌డౌన్ ప్రకటించింది. కొన్ని నెలలు పూర్తి స్థాయిలో రైలు సర్వీసులను నిలిపివేసినా.. ఆ తర్వాత అన్‌లాక్ నేపధ్యంలో ప్రయాణీకుల సౌకర్యార్ధం దేశవ్యాప్తంగా స్పెషల్ ట్రైన్స్‌ను ఇండియన్ రైల్వేస్ తిప్పుతోంది. ఇక ఇప్పుడు కరోనా వ్యాప్తి క్రమక్రమంగా అదుపులోకి వస్తోంది. ఈ తరుణంలో అన్ని రకాల రైళ్లను తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారన్నది ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. దీనిపై తాజాగా రైల్వే శాఖ స్పందించింది.

దేశవ్యాప్తంగా అన్ని రకాల రైలు సర్వీసులను తిరిగి ప్రారంభించే విషయంలో స్పష్టమైన తేదీని ఇప్పట్లో చెప్పలేమని రైల్వే బోర్డు చైర్మన్ వి.కే. యాదవ్ తేల్చి చెప్పేశారు. ప్రస్తుతం రైల్వే శాఖ సీనియర్ అధికారులు.. రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నారని.. దశల వారీగా సాధారణ రైళ్లను తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించింది. కాగా, లాక్‌డౌన్ నాటి నుంచి ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో రైలు సర్వీసులు నడవకపోవడంతో.. ఈ ఏడాది ఇండియన్ రైల్వేస్ భారీ నష్టాలను చవి చూసింది.

Also Read:

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. జనవరి 1 నుంచి ఉచిత బస్సు పాసులు..

‘చాయ్’ ప్రియులకు అలెర్ట్.. పేపర్ కప్పుల్లో తాగుతున్నారా.! ఆరోగ్యానికి ఇబ్బందేనంటున్న పరిశోధకులు..

‘మాస్టర్’ తెలుగు టీజర్ వచ్చేసింది.. విజయ్ స్క్వేర్ ఫైట్ సీన్స్ ఫ్యాన్స్‌కు పండగే..

విద్యార్థులకు మోదీ సర్కార్ ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తోందా.? వైరల్ అవుతున్న మెసేజ్.. వివరణ ఇచ్చిన కేంద్రం..