పది డ్రోన్లకు ఇండియన్ నేవీ ప్రతిపాదన!

| Edited By:

Aug 14, 2020 | 8:45 PM

సముద్ర జలాల్లో నిఘాను మరింత పటిష్ఠం చేసేందుకు యుద్ధనౌకలపై వినియోగించే మానవ రహిత డ్రోన్లను కొనుగోలు చేయనున్నది. అత్యవసరంగా పది డ్రోన్లను భారత నౌకాదళం సమకూర్చుకోనున్నది.

పది డ్రోన్లకు ఇండియన్ నేవీ ప్రతిపాదన!
Follow us on

సముద్ర జలాల్లో నిఘాను మరింత పటిష్ఠం చేసేందుకు యుద్ధనౌకలపై వినియోగించే మానవ రహిత డ్రోన్లను కొనుగోలు చేయనున్నది. అత్యవసరంగా పది డ్రోన్లను భారత నౌకాదళం సమకూర్చుకోనున్నది. సుమారు రూ.1200 కోట్ల వ్యయంతో కూడిన పది డ్రోన్ల కోసం రక్షణ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదన పంపింది. దక్షిణ చైనా సముద్రంపై పెత్తనం చెలాయిస్తున్న చైనా ఆగడాలకు అడ్డుకట్ట వేసే దిశగా భారత నౌకాదళం సన్నద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో సముద్రంపై నిరంతరం నిఘా పెట్టేందుకు పది డ్రోన్ల కొనుగోలు కోసం టెండర్లు పిలువనున్నది. మరోవైపు మడగాస్కర్, మలక్కా స్ట్రైట్ తదితర సముద్ర జలాలపై నిఘాను మరింతగా పటిష్ఠం చేసేందుకు మరో ప్రాజెక్టులో భాగంగా అమెరికా నుంచి సీ గార్డియన్ డ్రోన్లను సమకూర్చుకోనున్నది.

Read More:

అమరావతి రైతులకు అన్యాయం జరగదు..!

సౌండ్ పొల్యూషన్ నిబంధనలు అతిక్రమిస్తే.. రూ.లక్ష జరిమానా..!