Indian Navy Recruitement: ఇండియన్ నేవీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. స్పెషల్ నావల్ ఓరియంటేషన్ కోర్సు కింద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లోభాగంగా మొత్తం ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* అవివాహిత స్త్రీ, పురుషులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* నోటిఫికేషన్‌లో భాగంగా ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌లో ఎస్ఎస్‌సీ ఎగ్జిక్యూటివ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) పోస్టులు ఉన్నాయి.
* పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 60% మార్కులతో కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ ఐటీలో బీఈ/ బీటెక్ (లేదా) ఎమ్మెస్సీ (కంప్యూటర్/ ఐటీ)/ ఎంసీఏ/ ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ) ఉత్తీర్ణత పొంది ఉండాలి.
* వీటితో పాటు నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి.
* అభ్యర్థుల వయసు 02 జులై 1997, జనవరి 01, 2003 మధ్య జన్మించి ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులకు ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్ఏ), ఎజిమళ, కేరళలో శిక్షణ ఇస్తారు.
* కరోనా నేపథ్యంలో ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించకుండా అకడమిక్ మెరిట్ ద్వారా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు.
* అనంతరం షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 27-01-2022 ప్రారంభం కాగా, 10-02-2022తో ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Bank Accounts: ఒకరికి ఎన్ని బ్యాంకు ఖాతాలుండాలి.. ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే..
Akhanda: ఇది ముమ్మాటికి అఖండ విజయమే.. రికార్డు కలెక్షన్లతో దుమ్ములేపిన బాలయ్య..