లాక్‌డౌన్ ఎఫెక్ట్: దుబాయ్ లోని భారతీయులు.. స్వదేశానికి..

| Edited By:

Apr 30, 2020 | 5:45 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్‌డౌన్ విధించాయి. ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. విదేశాల్లో ఉన్న భారతీయులను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

లాక్‌డౌన్ ఎఫెక్ట్: దుబాయ్ లోని భారతీయులు.. స్వదేశానికి..
Follow us on

Indian missions in UAE: కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్‌డౌన్ విధించాయి. ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. విదేశాల్లో ఉన్న భారతీయులను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం డేటా సేకరణ వివరాలను దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ వెబ్‌సైట్ ద్వారా ప్రకటించింది.

కాగా,, ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్ లో( www.indianembassyuae.gov.in లేదా www.cgidubai.gov.in ) తమ పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. కరోనా నేపథ్యంలో దుబాయ్ లో చిక్కుకున్న భారతీయులను తీసుకువచ్చేందుకు మాత్రమే నమోదు ప్రక్రియను ప్రారంభించినట్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.