ఆస్ట్రేలియా లాంగ్ సిరీస్ కోసం సిడ్నీ గడ్డపై అడుగు పెట్టిన టీమిండియా
టీమిండియా ఆటగాళ్లు ఆస్ట్రేలియా గడ్డపై అడుగు పెట్టారు. దాదాపు రెండు నెలల సుధీర్ఘంపాటు అక్కడే ఉండనున్నారు. ఐపీఎల్ తర్వాత ఆస్ట్రేలియాకు పయనమైన టీమిండియా క్రికెటర్లు..
Team India arrives in Sydney : టీమిండియా ఆటగాళ్లు ఆస్ట్రేలియా గడ్డపై అడుగు పెట్టారు. దాదాపు రెండు నెలల సుధీర్ఘంపాటు అక్కడే ఉండనున్నారు. ఐపీఎల్ తర్వాత ఆస్ట్రేలియాకు పయనమైన టీమిండియా క్రికెటర్లు.. గురువారం సిడ్నీ ఎయిర్ పోర్టులో దిగారు.
వీరితో పాటే లీగ్లో పాల్గొన్న ఆసీస్ క్రికెటర్లు స్టీవ్ స్మిత్, వార్నర్ తదితరులు అక్కడికి చేరుకున్నారు. వీరితో పాటు కోహ్లీసేన.. సిడ్నీలోనే 14 రోజుల పాటు క్వారంటైన్.. బయో బబుల్‌లో ఉండనుంది. అనంతరం నవంబరు 27న జరిగే తొలి వన్డేలో ఆటగాళ్లు పాల్గొననున్నారు.
జనవరి 19 వరకు సాగే ఈ పర్యటనలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా.. మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనున్నాయి. అయితే పితృత్వ సెలవులు తీసుకున్న కారణంగా చివరి మూడు టెస్టులకు కోహ్లీ దూరం కానున్నాడు.