రియల్ టైం ఎలక్ట్రిసిటీ మార్కెట్ ట్రేడింగ్ షురూ.. 24 గంటలు అందుబాటులో..

| Edited By:

Jun 02, 2020 | 11:40 AM

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ భారతదేశంలో అతిపెద్ద ఇంధన మార్పిడి సంస్థ.

రియల్ టైం ఎలక్ట్రిసిటీ మార్కెట్ ట్రేడింగ్ షురూ.. 24 గంటలు అందుబాటులో..
Follow us on

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ భారతదేశంలో అతిపెద్ద ఇంధన మార్పిడి సంస్థ. ప్రస్తుతం వినియోగదార్లు (డిస్కం లు) విద్యుత్‌ ఎక్స్ఛేంజీల్లో ఒక రోజు ముందు విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నారు. అయితే.. ఈ సంస్థ రియల్ టైమ్ ఎలక్ట్రిసిటీ మార్కెట్ (ఆర్టిఎం) ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది, డిస్కం (డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ)లకు వారి విద్యుత్ అవసరాలను చక్కగా ప్లాన్ చేయడంలో సహాయపడే ఉద్దేశంతో ఈ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది.

కాగా.. ఆర్‌టీఎమ్‌ ప్లాట్‌ఫామ్ ద్వారా వినియోగదార్లు(వీరిలో ప్రధానంగా డిస్కంలు ) డెలివరీకి ఒక గంట ముందు ఎక్స్ఛేంజీల్లో విద్యుత్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ (IEX), స్టాక్ మార్కెట్ కు ఇచ్చిన సమాచారం ప్రకారం, విద్యుత్తును తక్షణమే కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి ఈ మార్కెట్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సిఇఆర్సి) ప్రయత్నాల ద్వారా సాధ్యమైందని తెలిపింది.

మరోవైపు.. డిస్కం (డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ) లతో చర్చలు జరుపగా అవన్నీ రియల్‌ టైం మార్కెట్‌లో పాల్గొనడానికి సంసిద్ధత వ్యక్తం చేశాయని ఐఈఎక్స్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ అధిపతి రోహిత్‌ బజాజ్‌ ఇటీవల పేర్కొన్నారు. ఏప్రిల్‌ 1నే దీనిని ప్రారంభించాలని తొలుత భావించినప్పటికీ.. కరోనా కారణంగా జూన్‌ 1కి వాయిదా వేయాలని మార్చి మొదట్లో విద్యుత్‌ నియంత్రణ సంస్థ సీఈఆర్‌సీ నిర్ణయించింది.

Also Read: కరోనా ట్రెండీ కలెక్షన్.. డిజైనర్ మాస్కులు.. న్యూ ఫ్యాషన్..