ప్రేమలో పడిన వారికి ప్రపంచ జ్ఞానం ఉండదని అంటారు. కొంతమంది ప్రేమికులు ఇది నిజమని తరచుగా నిరూపిస్తున్నారు. తమ చుట్టూ జనాలను మర్చిపోయి.. సోయి లేకుండా బహిరంగ ప్రదేశాల్లో రొమాన్స్ చేస్తున్నారు. ఇలా ప్రేమికులు ప్రేమ హద్దులు దాటి అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పనులు ఎక్కువగా పార్కుల్లో చేస్తుంటారు. కానీ తాజాగా ప్రయాణికులతో నిండిన బస్సులో ఇద్దరు ప్రేమికులు రొమాన్స్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన తాజాగా చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఈ ఘటన ఒడిశాలోని రూర్కెలాలో జరిగినట్లు చెబుతున్నారు. ప్రేమికులు రన్నింగ్‌లో ఉన్న బస్సులో రొమాన్స్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. ఈ దృశ్యాన్ని ఓ ప్రయాణికుడు కెమెరాలో బంధించగా, ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సదరు వీడియోను మనోజ్ శర్మ అనే వ్యక్తి తన X ఖాతాలో పంచుకున్నాడు. “మెట్రో రైళ్లలో అయిపోయింది. ఇప్పుడు బస్సులలో ఇలాంటి దారుణాలు చూడాల్సి వస్తుంది” అని క్యాప్షన్ ఇచ్చాడు.
వైరల్ వీడియోలో, ఇద్దరు ప్రేమికులు బస్సులో వెనుక సీటులో కూర్చుని, ముద్దులు పెట్టుకుంటూ రొమాన్స్‌లో మునిగిపోవడం మీరు చూడవచ్చు. పక్కన ఓ పెద్దావిడ ఉన్న కూడా పట్టించుకోకుండా వారు అనుచితంగా ప్రవర్తించారు.ఈ వీడియోకు 30 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు ఈ జంటను ఏకిపారేస్తున్నారు. సంస్కృతి సంప్రదాయాలను పాడు చేస్తున్నారని మండిపడుతున్నారు.