
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. ఈ క్రమంలో దేశ రాజధానిలో ఉన్న ఆర్మీ హెడ్ క్వార్టర్స్‌ని మూసేశారు. అందులో పని చేస్తున్న ఓ సైనికుడికి కోవిడ్-19 పాజిటివ్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు.
Also Watch: లాక్ డౌన్ అమలుపై కేసీఆర్ కీలక నిర్ణయం
మరోవైపు.. “ఢిల్లీ హెడ్‌క్వార్టర్స్‌లోని సేన భవన్‌లో ఉన్న సైనికుడికి శుక్రవారం కోవిద్-19 పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కార్యాలయాన్ని మూసివేయాలని నిర్ణయం తీసుకున్నాం. కరోనా సోకిన సైనికుడికి సమీప సైనికులు, ఇతరులు, అతడితో సన్నిహితంగా వ్యవహరించిన వారిని క్వారంటైన్‌కు పంపిస్తున్నాం” అని ఆర్మీ కార్యాలయం పేర్కొన్నట్లు సమాచారం.
తాజాగా.. దేశంలో కరోనా కేసులు 81,970 పైగానే ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా 2,649 మంది కరోనా ధాటికి హతులయ్యారు. ఇప్పటికి సుమారుగా 28 వేల మంది కరోనా నుంచి కోలుకోగా ప్రస్తుతం 51,000 పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Also Read: కరోనా అదుపులోకి వచ్చాకే స్కూళ్ళు..: కేంద్ర మంత్రి