AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక పవర్ ఫుల్ ఆర్మీ.. త్రివిధ దళాలకు ఒకే బాస్.. మోదీ

త్రివిధ దళాలకు ఇక ఒకే చీఫ్ ఉంటారని ప్రధాని మోదీ ప్రకటించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్.. ఈ మూడింటి మధ్య సమన్వయం ఉండేలా చూసేందుకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు. దీనివల్ల సాయుధ దళాలన్నీ ఇంకా బలోపేతమవుతాయని మోదీ పేర్కొన్నారు. 73 వ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా గురువారం ఢిల్లీ లోని ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సుమారు 93 నిముషాల సేపు ప్రసంగించిన మోదీ… ఈ […]

ఇక పవర్ ఫుల్ ఆర్మీ.. త్రివిధ దళాలకు ఒకే బాస్.. మోదీ
Pardhasaradhi Peri
|

Updated on: Aug 15, 2019 | 12:25 PM

Share

త్రివిధ దళాలకు ఇక ఒకే చీఫ్ ఉంటారని ప్రధాని మోదీ ప్రకటించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్.. ఈ మూడింటి మధ్య సమన్వయం ఉండేలా చూసేందుకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు. దీనివల్ల సాయుధ దళాలన్నీ ఇంకా బలోపేతమవుతాయని మోదీ పేర్కొన్నారు. 73 వ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా గురువారం ఢిల్లీ లోని ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సుమారు 93 నిముషాల సేపు ప్రసంగించిన మోదీ… ఈ త్రివిధ దళాల్లో ఏ దళంలో నైనా ఫోర్ స్టార్ ఆఫీసర్ అయిన వ్యక్తి సర్వీసు చీఫ్ లకు సీనియర్ గా ఉంటారని అన్నారు. ఈ సేనలకు. ప్రధానికి మధ్య ఈ వ్యక్తి సంధాన కర్తగా ఉంటారని ఆయన చెప్పారు. 1999 లో కార్గిల్ వార్ అనంతరం ఏర్పాటైన కమిటీ ఈ మేరకు సిఫారసు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ యుధ్ధ సమయంలో భారత్ లోకి పాకిస్థానీ సైనికులు చొరబడిన నేపథ్యంలో.. సెక్యూరిటీలోని వైఫల్యాలను పరిశీలించేందుకు నాటి ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. అటు-దేశ జనాభా విపరీతంగా పెరిగిపోతున్న తీరుపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవాలునెదుర్కొనేందుకు కొన్ని పథకాలు అవసరమవుతాయని ఆయన చెప్పారు. మన పిల్లల ఆశయాలకు మనం న్యాయం చేయగలుగుతామా అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవలసిన అవసరం వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. పాపులేషన్ ఎక్స్ ప్లోజన్ పై విస్తృత చర్చ జరగాలి.. ప్రజల్లో అవగాహన పెరగాలి… జనాభా పెరుగుతూ పోతే భవిష్యత్ తరాలు ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.. ఈ సమస్య పరిష్కారానికి కేంద్రంతో బాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలి అని మోడీ సూచించారు. జమ్మూ కాశ్మీర్ కు సంబంధించి 370 అధికరణం రద్దుతో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆకాంక్షను నెరవేర్చగలిగామని ఆయన పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న చర్యతో కశ్మీర్ ప్రజలకు పూర్తి స్వేఛ్చ లభించిందని అన్నారు. కీలకమైన ఈ నిర్ణయాలను తీసుకోవడం ద్వారా ఆ రాష్ట్ర ప్రజలకు బహుమతి ఇచ్చాం.. లడఖ్ లో శాంతి స్థాపనే మా లక్ష్యం.. ఒకే దేశం.. ఒకే రాజ్యాంగం.. అన్న పటేల్ కల నెరవేరింది అని మోదీ చెప్పారు. జీఎస్టీలో వన్ నేషన్.. వన్ టాక్స్, వన్ నేషన్.. వన్ గ్రిడ్, వన్ నేషన్.. వన్ మొబిలిటీ కార్డులు సాధ్యమయ్యాయని ఆయన అన్నారు. త్వరలో వన్ నేషన్.. వన్ ఎలక్షన్ కూడా అమలు చేస్తామని చెప్పారు. ట్రిపుల్ తలాక్ బిల్లు తెఛ్చి ముస్లిం మహిళల భద్రతకు ప్రాధాన్యమిచ్చినట్టు మోదీ పేర్కొన్నారు. . దేశ ప్రజలకు మేమిచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం అని ఆయన ప్రకటించారు.

టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేదు..కొత్త వ్యవస్థ.. అదేంటంటే..
టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేదు..కొత్త వ్యవస్థ.. అదేంటంటే..
భయపెడుతోన్న వాతావరణ శాఖ.. గడపదాటాలంటే ప్రజల్లో వణుకు..
భయపెడుతోన్న వాతావరణ శాఖ.. గడపదాటాలంటే ప్రజల్లో వణుకు..
18 ఏళ్లకే ఇండస్ట్రీలో సంచలనం.. 25 ఏళ్లకే ఆత్మహత్య చేసుకుంది..
18 ఏళ్లకే ఇండస్ట్రీలో సంచలనం.. 25 ఏళ్లకే ఆత్మహత్య చేసుకుంది..
డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల