Team India: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ తర్వాత మహ్మద్ సిరాజ్ ఇప్పుడు ప్రపంచంలోనే నంబర్ వన్ బౌలర్‌గా మారాడు. ICC తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఈ ఫాస్ట్ బౌలర్ మొదటి స్థానం ఆక్రమించాడు. గత ఏడాది కాలంలో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఎట్టకేలకు అతడికి బహుమతి లభించింది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌ను వెనక్కి నెట్టి సిరాజ్ మొదటి స్థానాన్ని సాధించాడు. వన్డే ఫార్మాట్‌లో సిరాజ్ నంబర్‌వన్‌గా నిలవడం ఇదే తొలిసారి.
మొహమ్మద్ సిరాజ్ 2019 సంవత్సరంలో తన వన్డే అరంగేట్రం చేశాడు. అయితే కొంతకాలం తర్వాత అతను జట్టు నుంచి తొలగించబడ్డాడు. గత ఏడాది ఫిబ్రవరిలో, సిరాజ్ ఈ ఫార్మాట్‌లో పునరాగమనం చేశాడు. అప్పటి నుండి టీమ్ ఇండియా అత్యంత నమ్మకమైన బౌలర్‌గా నిలిచాడు. తిరిగి వచ్చినప్పటి నుంచి సిరాజ్ 20 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 37 వికెట్లు సాధించాడు. ముఖ్యంగా పవర్‌ప్లేలో, సిరాజ్ బ్యాట్స్‌మెన్స్‌ను ఇబ్బంది పెట్టడం కనిపించింది.
? There’s a new World No.1 in town ?
India’s pace sensation has climbed the summit of the @MRFWorldwide ICC Men’s ODI Bowler Rankings ?
More ?
— ICC (@ICC) January 25, 2023
ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో సిరాజ్ తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. అతను శ్రీలంక బ్యాట్స్‌మెన్‌పై విధ్వంసం సృష్టించాడు. అదే సమయంలో, న్యూజిలాండ్‌తో సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసుకున్నాడు. స్వస్థలమైన హైదరాబాద్‌లో తొలిసారి ఆడి, సత్తా చాటాడు. ఈ సిరీస్ తర్వాత, సిరాజ్ ఇప్పుడు 729 రేటింగ్ పాయింట్లతో నంబర్ వన్‌లో ఉన్నాడు. మరోవైపు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్ వుడ్ 727 పాయింట్లతో రెండో స్థానంలో, కివీస్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 708 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ర్యాంకింగ్‌లో సిరాజ్‌తో పాటు షమీకి కూడా పెద్ద ప్రయోజనం లభించింది. 11 స్థానాలు ఎగబాకి 32వ స్థానానికి చేరుకున్నాడు.
బ్యాట్స్‌మెన్స్ గురించి చెప్పాలంటే, బాబర్ ఆజం ఇప్పటికీ మొదటి స్థానంలో ఉన్నాడు. అయితే టాప్ 10లో ముగ్గురు భారత బ్యాట్స్‌మెన్‌లు చేరారు. న్యూజిలాండ్‌పై డబుల్ సెంచరీ సాధించిన శుభ్‌మన్ గిల్ 20 స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకున్నాడు.ప్రస్తుతం రోహిత్ శర్మ (8వ స్థానం), విరాట్ కోహ్లీ (7వ స్థానం) కంటే ముందున్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..