India Vs Australia 2020: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై క్రికెట్ అభిమానులు మరోసారి ట్రోల్స్‌తో విరుచుకుపడుతున్నారు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ విల్ పుకోవిస్కీ 3 ఓవర్ల వ్యవధిలో ఇచ్చిన రెండు క్యాచ్‌లు పంత్ జారవిడచడంతో.. ఫ్యాన్స్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నాడు. అటు పంత్ ఇచ్చిన లైఫ్‌లైన్‌తో పుకోవిస్కీ ఆడుతున్న డెబ్యూ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేసి అదరగొట్టాడు.
22వ ఓవర్‌లో అశ్విన్ వేసిన చివరి బంతికి.. 25 ఓవర్‌లో సిరాజ్ బౌలింగ్‌లో పుకోవిస్కీ ఇచ్చిన రెండు క్యాచ్‌లను పంత్ అందుకోలేకపోయాడు. దీనితో పంత్‌ను ట్రోల్ చేస్తూ క్రికెట్ ఫ్యాన్స్ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. పంత్ స్థానంలో సాహాను తుది జట్టులోకి తీసుకోవాల్సిందని ఒకరు కామెంట్ చేస్తే.. క్యాచింగ్ విషయంలో పంత్ నిరుత్సాహపరుస్తున్నాడని మరొకరు పెదవి విరుస్తున్నారు.
Is #RishabPant India’s #KamranAkmal? #IndiavsAustralia #BCCI
— Yogeshwar (@yoge_sh) January 7, 2021
Ravi Shastri selecting Pant for 3rd Test.?♂️ pic.twitter.com/IbA800Y6eP
— Tuhada_Peo (@ChakFatte) January 7, 2021
I think instead of Saha and Rishab Pant we should give a chance to KL Rahul or Sanju Samson.
— Sanjay (@Sanjay86293853) January 7, 2021