Alludu Adhurs Movie: సాంగ్ షూటింగ్ కోసం వెళ్ళి కశ్మీర్లో చిక్కుకున్న ‘అల్లుడు అదుర్స్’ యూనిట్..
హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం అల్లుడు అదుర్స్. ఈ చిత్రానికి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌కు విశేష
హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అల్లుడు అదుర్స్’. ఈ చిత్రానికి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. దీంతో ఈ సినిమాపై అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుగు రానుంది. అయితే ఈ సినిమాలోని చివరి పాట షూటింగ్ కోసం కశ్మీర్ వెళ్ళింది చిత్రయూనిట్. చిత్ర దర్శకుడు, హీరో మరియు చిత్రయూనిట్ వెళ్ళి సాంగ్ షూటింగ్ పూర్తి చేశారు. గత కొన్ని రోజులుగా కశ్మీర్, శ్రీనగర్ ప్రాంతాలలో మంచు వర్షం కురుస్తుండడంతో అక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో చిత్రయూనిట్ మొత్తం అక్కడే చిక్కుకుపోయిందని సమాచారం.
అయితే మంగళవారమే ఈ చిత్రయూనిట్‌తో సహా డైరెక్టర్ కూడా హైదరాబాద్ రావాల్సి ఉంది. కానీ అక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో మూవీ టీం అక్కడే ఉండిపోయిందని టాక్ వినిపిస్తోంది. జనవరి 15న సినిమా విడుదలవ్వాల్సి ఉండగా.. చిత్రయూనిట్ అక్కడ చిక్కుకుపోవడంతో కొంత ఆందోళనలో మూవీ మేకర్స్ ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కశ్మీర్లో చిక్కుకున్న చిత్ర బృందం తిరిగి హైదరాబాద్ ఎప్పుడు చేరుకుంటారనేది తెలియాల్సి ఉంది.
Also Read: సంక్రాంతికి సందడి చేయనున్న బెల్లంకొండ శ్రీనివాస్.. ‘అల్లుడు అదుర్స్’ అనిపిస్తాడా..?
Bellamkonda Sreenivas : బెల్లంకొండ శ్రీనివాస్‌తో జతకట్టేందుకు అతిలోక సుందరి కూతురు ఓకే చెప్పిందా..?