ఆచితూచి ఆడుతోన్న టీమిండియా.. అర్ధ సెంచరీకి చేరువలో రహానె.. వికెట్ల కోసం ఆసీస్ బౌలర్ల ఆరాటం..

India Vs Australia 2020: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆచితూచి బ్యాటింగ్ చేస్తోంది. నాలుగో వికెట్ రూపంలో హనుమ విహారి..

ఆచితూచి ఆడుతోన్న టీమిండియా.. అర్ధ సెంచరీకి చేరువలో రహానె.. వికెట్ల కోసం ఆసీస్ బౌలర్ల ఆరాటం..

Updated on: Dec 27, 2020 | 9:28 AM

India Vs Australia 2020: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆచితూచి బ్యాటింగ్ చేస్తోంది. నాలుగో వికెట్ రూపంలో హనుమ విహారి(21; 66 బంతుల్లో 2×4) లియోన్ బౌలింగ్‌లో ఔట్ కాగా.. ఒక ఎండ్ నుంచి రహానె(49) స్కోర్ బోర్డును ముందుకు కదిలిస్తున్నాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్(29)తో కలిసి 55 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అటు ఆదివారం 36/1తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్‌కు.. ఆరంభంలోనే ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమ్మిన్స్ దెబ్బ తీశాడు. క్రీజులో కుదురుకుంటున్న శుభ్‌మాన్ గిల్(45), పుజారా(17)లను వరుస ఓవర్లలో పెవిలియన్‌కు పంపాడు. కాగా, టీమిండియా 59 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్లు నష్టపోయి 173 పరుగులు చేసింది.